గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
● భారీగా ఆస్తి నష్టం
విడవలూరు: గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు దగ్ధమైన ఘటన మండలంలోని ఊటుకూరు పెద్దపాళెం గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పాపింగారి నాగభూషణం అనే వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఆయన కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నాడు. దీంతో సమీపంలో రేకులతో చిన్న ఇంటిని నిర్మించి రూ.4.50 లక్షలు నగదు, రూ.7 లక్షల విలువైన బంగారం, డాక్యుమెంట్లు, ఫ్రిడ్జ్, గ్యాస్ సిలిండర్, బీరువా తదితరాలను అందులో ఉంచాడు. బుధవారం రాత్రి పనులు ముగిశాక నిద్రించేందుకు రోజూలాగే సమీపంలోని బంధువుల ఇంటికెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో బయటకు పరుగులు తీశాడు. రేకుల ఇంట్లో నుంచి మంటలు చెలరేగాయి. సిలిండర్ రెండు ముక్కలై బయటపడి ఉంది. దీంతో అక్కడి వారు భయాందోళనకు లోనయ్యారు. ఈ ఘటనతో సుమారు రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు నాగభూషణం చెబుతున్నాడు. కొత్త సిలిండర్ను బుక్ చేసుకుని, ఇంత వరకు దానిని వినియోగించలేదని, ఎలా పేలిందో అర్థం కావడం లేదని వాపోయాడు. కూలీగా వెళ్లిన సంపాదించిన డబ్బు, వస్తువులు కాలిపోయాయని, కట్టుబట్టలతో మిగిలామని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment