జియో ట్యాగింగ్ నత్తనడక
జిల్లాలోని 38 మండలాల్లో గల 722 గ్రామ పంచాయతీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, కావలి, కందుకూరు, ఆత్మకూరు మున్సిపాలిటీల్లోని ప్రతి ఇంటినీ మ్యాపింగ్ (జియో ట్యాగింగ్) చేయాలని గ్రామ, వార్డు సచివాలయ రాష్ట్ర డైరెక్టర్ ఎం.శివప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. – కావలి
● జిల్లాలోని 530 గ్రామ, 220 వార్డు సచివాలయాల్లో గల ఉద్యోగులు క్లస్టర్ వారీగా ప్రతి ఇంటినీ జియోట్యాగింగ్ చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా
● ప్రతి సచివాలయ పరిధిలో 11 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో ఉద్యోగి గ్రామాల్లో 70 నుంచి 80 ఇళ్లను మ్యాపింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
● జిల్లాలో 8,47,587 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,87,718 కుటుంబాల్లో ఇంటింటి మ్యాపింగ్‌ను పూర్తి చేశారు. మిగిలిన 3,59,869 కుటుంబాల్లో సర్వే చేయాల్సి ఉంది.
● చంద్రబాబు ప్రభుత్వం ఇళ్లను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను కూడా నమోదు చేసి డేటా బేస్ నమోదు చేస్తోంది.
● భవిష్యత్తులో సంక్షేమ పథకాల మంజూరు, తొలగింపుపై ఈ సర్వే ప్రభావం ఉంటుందనే భావనతో జియో మ్యాపింగ్‌కు ప్రజలు వెనుకడుగేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment