విచ్చలవిడి తనానికి పరాకాష్ట
జిల్లాలో ఊరూరా మద్యం బెల్టు షాపులు ఓ రేంజ్‌లో నడుస్తున్నాయి. మద్యం దుకాణాల్లో కంటే బెల్టు షాపుల్లోనే వ్యాపారం జోరుగా జరుగుతుందంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. బార్లను తలపించే రీతిలో బెల్టు షాపులు, మద్యం దుకాణాల్లో సిట్టింగ్ ఏర్పాట్లు చేసి వైరెటీ స్టఫ్‌లు అందిస్తున్నారు. మద్యం షాపులను హస్తగతం చేసుకున్న కూటమి నేతలు తమ పార్టీల క్యాడర్ ఆర్థికంగా బలపడేందుకు బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారు. పల్లె, పట్నం తేడాలేకుండా వీధికొకటి.. ఊరుకు ఆరు లెక్కన బెల్టు షాపులను ఏర్పాటు చేశారు.
● సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం నుంచి కసుమూరు వెళ్లే రహదారిలో ఏర్పాటు చేసిన మద్యం షాపు బార్‌ను తలపిస్తోంది. షాపు పక్కనే పర్మిట్ రూమ్ సిద్ధం చేసి బార్‌లో ఉన్నట్లుగా హంగులతో మందుబాబులు కూర్చొని తాగేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎనీటైం మద్యం తాగేందుకు సౌకర్యాలు కల్పించారంటే ఏ స్థాయిలో బరితెగించారో ఈ దుకాణమే అద్దం పడుతోంది. ఇక ఈ షాపులో మద్యం ఎమ్మార్పీ కంటే రూ.20 అదనం. షాపును బహిరంగంగా బార్‌లా మార్చేసినా సంబంధిత ఎకై ్సజ్ శాఖ, పోలీసులు పట్టించుకోలేదంటే వీరిలో చేవ చచ్చిపోయిందా? లేక మామూళ్ల మత్తులో జోగుతున్నారా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
● కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం పరిధిలోని నేషనల్ హైవేకు 50 మీటర్ల దూరంలోనే గండవరం రోడ్డులో మద్యం షాపు ఏర్పాటు చేశారు. ఆ దుకాణం మంత్రి నారాయణ ముఖ్య అనుచరుడిది కావడంతో నిబంధనలు పాటించడం లేదు. వాస్తవంగా ఈ షాపు ఏర్పాటుకు లైసెన్స్ ఇచ్చిన ప్రదేశం వేరే అయితే.. నిబంధనలకు విరుద్ధంగా నేషనల్ హైవే పక్కనే పెట్టారు. ఆయన మంత్రి ముఖ్య అనుచరుడు, అధికార పార్టీ నేత కావడంతో అడిగే దమ్ము ఎకై ్సజ్ శాఖ, పోలీసులకు లేకుండా పోయింది.
● కోవూరు మండలంలోని సాలుచింతల వద్ద నేషనల్ హైవేకు 30 మీటర్ల దూరంలోనే మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం హైవేకు 220 మీటర్ల దూరంలో షాపు ఉండాలి. కానీ హైవే పక్కనే షాపు ఏర్పాటు చేసి దర్జాగా మద్యం విక్రయాలు చేసుకుంటున్నా.. అధికారుల్లో ఉలుకు పలుకు లేదు.
● మర్రిపాడు మండంలో ఐదు మద్యం షాపులు ఏర్పాటు చేశారు. వాటి యాజమానులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. డీసీపల్లి దుకాణానికి అనుబంధంగా కూల్ డ్రింక్స్ షాపులో బెల్టు షాపు ఏర్పాటుకు నెలకు రూ.70 వేలు, మర్రిపాడులో రూ.90 వేలు, చుంచులూరులో రూ.45 వేలు, చినమాచనూరులో రూ.40 వేలు కృష్ణాపురంలో రూ.60 వేలు వంతున మద్యం సిండికేట్‌కు చెల్లించేలా వేలం ద్వారా ఒప్పందాలు కుదుర్చుకుని బెల్టు దుకాణాలు ఏర్పాటు చేశారు.
వెంకటాచలం నుంచి కసుమూరుకు వెళ్లే
రహదారిలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం
3 వేలకుపైగా బెల్టు షాపులు
● బార్లను తలపిస్తున్న బెల్టు షాపులు
● నేషనల్ హైవే పక్కనే మద్యం దుకాణాలు
● అక్కడే సిట్టింగ్ వసతులు.. వైరెటీ స్టఫ్‌లు
● మర్రిపాడులో బెల్టు దుకాణాలకు వేలం పెట్టిన మద్యం సిండికేట్
● కోవూరు నియోజకవర్గంలో లైసెన్స్
ఒక చోట.. షాపు మరో చోట
● చర్యలు లేకపోవడంతో విచ్చలవిడిగా దుకాణాలు
జిల్లాలో 37 మండలాలు, నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు కావలి, ఆత్మకూరు మున్సిపాలిటీలు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు నగర పంచాయతీల్లో 182 మద్యం గెజిట్ దుకాణాలున్నాయి. గ్రామ పంచాయతీలు, మజరా గ్రామాలు కలిపి దాదాపు 2 వేలకుపైగా ఉంటాయి. ఇక కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో వెయ్యికిపైగా ప్రాంతాలు ఉంటాయి. ఎక్కడికక్కడ బెల్టు షాపుల ద్వారా కూటమి పార్టీల కేడర్‌కు ఆర్థికంగా వెసులుబాటు కల్పించేందుకు ఏరియాకొకటి కేటాయించారు. ఇలా ప్రతి మద్యం దుకాణానికి అనుబంధంగా 30 నుంచి 35 బెల్టు షాపులు కేటాయించినట్లు ఆ పార్టీ కేడరే చెబుతోంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 3 వేలకు పైగా బెల్టుషాపులు ఉన్నట్లు ప్రాథమిక అంచనా.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో బెల్టు దుకాణాల దందా నడుస్తోంది. మద్యం షాపుల నుంచి బెల్టు దుకాణాల వరకు అన్నీ టీడీపీ నేతలే నడుపుతుండడంతో ఆపే దమ్ము ఇటు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులకు, పోలీసులకు లేకుండా పోయింది. అడిగేదెవరు.. ఆపేదెవరంటూ నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. కూటమి నేతలు ఏ స్థాయికి బరితెగించారంటే.. బెల్టుషాపుల నిర్వహణకు బహిరంగ వేలం పాటలు పెట్టే పరిస్థితికి వచ్చారు. చాటు మాటుగా నిర్వహించే బెల్టు షాపులను ఇప్పుడు ఏకంగా లైసెన్స్‌డ్ బార్లు మాదిరిగా నిర్వహిస్తున్నారు. లైసెన్స్ దుకాణాలకే సిట్టింగ్ పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతి లేకపోతే.. బెల్టుషాపుల్లో సిట్టింగ్ వసతులు, కోరిన వైరెటీల్లో వేడివేడి స్టఫ్‌లు అందిస్తున్నారంటే బెల్టు దందా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
24 గంటలూ అందుబాటులో మద్యం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం బెల్టు షాపుల నిర్వహణ నేరం. అయితే మద్యం వ్యాపారం అధికార పార్టీకి చెందిన వారి చేతుల్లోకి వెళ్లడంతో పట్టణాలు, గ్రామాల్లో బెల్టు షాపులను విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. గతంలో బెల్టు షాపుల్లో కేవలం ఛీప్ లిక్కర్ మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం మద్యం షాపుల్లో దొరికే అన్నిరకాల బ్రాండ్లు, బీర్లు అందుబాటులో ఉన్నాయి. బెల్టు దుకాణాల్లో క్వార్టర్ బీరుపై అదనంగా రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. మద్యం దుకాణాలతో పాటు బెల్టుషాపులకు అనుబంధంగా పక్కనే కూల్‌డ్రింక్ షాపుల ముసుగులో సిట్టింగ్ రూమ్‌లు కొనసాగుతున్నాయి. మద్యం దుకాణాలు నిబంధనల మేరకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు, బార్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే విక్రయాలు సాగించాలి. అయితే అందుకు భిన్నంగా 24/7 గంటలూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.
డమ్మీగా మారిన ఎకై ్సజ్ శాఖ
జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డమ్మీగా మారి కూటమి పార్టీ నేతల చెప్పు చేతల్లో పనిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు, బెల్టుషాపులు ఏర్పాటు చేస్తున్నా.. నియంత్రించే స్థితిలో ఆ శాఖ లేదనే చెప్పాలి. విచ్చలవిడిగా బెల్టుషాపులకు బహిరంగంగానే వేలం పాటలు నిర్వహించే ఏర్పాటు చేస్తున్నారనే విషయం తెలిసినా.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తమ శాఖ ఉందని చెప్పుకోవడానికి అన్నట్లుగా ఎకై ్సజ్, ఏసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఈఎస్ స్క్వాడ్ అధికారులు మొక్కుబడి చర్యలకే పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి. ఎక్కడో అధికార పార్టీకి వ్యతిరేకులు ఎవరైనా మద్యం తీసుకెళ్లి విక్రయిస్తున్నారని తెలిసి వారిపైనే కేసులు నమోదు చేశారనే ఆరోపణలు లేకపోలేదు. ఆ మద్యం ఏ షాపు నుంచి తెచ్చారో ఆ షాపుపై కేసు నమోదు చేయకపోవడం చూస్తే మద్యం వ్యాపారులు, బెల్టు షాపుల నిర్వాహకులతో కుదుర్చుకున్న ముందస్తు ఒప్పందాలే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం
జిల్లాలో బెల్టు షాపులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. మాకు అందిన సమాచారం మేరకు తరచూ దాడులు నిర్వహించి మద్యం పట్టుకుని వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. జిల్లాలో నూతన మద్యం పాలసీ అమలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 181 కేసులు నమోదు చేసిన 182 మందిని అరెస్ట్ చేశాం. వారి నుంచి 420 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నాం. ఎక్కడైనా అనధికార మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతాం.
– ఎ.శ్రీనివాసులనాయుడు, ఏసీ, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment