పండు ఈగతో పంట నష్టం
● జామ రైతు దిగాలు ● పాడైపోతున్న కాయలు
తైవాన్ జామ తోటలు సాగు చేసిన జిల్లా రైతులు ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. జిల్లాలో సుమారు వెయ్యి ఎకరాల్లో 350 మంది రైతులు ఈ తోటలు సాగు చేస్తున్నారు. తోటలు తెగుళ్ల బారినపడి పంట దిగుబడి తగ్గింది. పండు ఈగ వల్ల పండ్లు పనికిరాకుండా పోతున్నాయి.
– పొదలకూరు
● పండుఈగ కాయల్లోని రసాన్ని పీల్చి, పండులోకి వైరస్‌ను వదలడం వల్ల కాయలు పాడైపోతున్నాయి.
● జిల్లాలో పొదలకూరు, ఆత్మకూరు, రాపూరు, చేజర్ల, కలువాయి, మనుబోలు తదితర మండలాల్లో తైవాన్ జామ సాగవుతోంది. ఒకసారి మొక్కలు నాటితే పదేళ్ల వరకు కాపు కాస్తుంది.
● జామతోటల నుంచి ఒకేసారి దిగుబడి రావడం వల్ల వాటికి మార్కెట్‌లో గిట్టుబాటు రేటు లభించడం లేదు. పండ్లు నిల్వ చేసుకునే కోల్డ్ స్టోరేజీలు లేకపోవడం వల్ల రైతులు పంటను తక్కువ రేటుకై నా అమ్ముకోవలసి వస్తోంది.
● ప్రస్తుతం కిలో రూ.20 నుంచి రూ.30 అమ్ముడుపోతున్నట్టు రైతులు తెలిపారు. దూరప్రాంతాలకు ఎగుమతి చేసినా 22 కిలోల బాక్సు రూ.500 మాత్రమే అమ్ముడు పోతున్నాయి. గతంలో బాక్సుకు రూ.650 ధరలు పలికేవి.
● మెట్టప్రాంత గ్రామాల్లో పండే జామకాయలు నెల్లూరు, చైన్నె మార్కెట్‌కు తరలిస్తున్నారు. చైన్నె మార్కెట్ వ్యాపారులు కొందరు తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
● పండు ఈగ వల్ల కాయలు, పండ్లకు పురుగు పడుతుంది. జామ కాయలో పురుగులు ఉంటే మార్కెటింగ్‌కు పనికిరావు. అయితే ప్రూట్ ఫ్‌లైట్ బాక్సుల ఏర్పాటు వల్ల ఈగలను అరికట్టవచ్చని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. బాక్సుల్లో మిథైల్ ఇథనాల్ కలిగిన చెక్కలను వేసి వాటిపై రెండు బొట్లు నువాన్ వేయాలి. ఆ వాసనకు మగ ఈగలు ఆకర్షించబడి రసాయనం వల్ల మృతి చెందుతాయి. దాంతో పండు ఈగల సంతానోత్పత్తి తగ్గి తోటల్లో లేకుండాపోతాయి.
ధరలు దిగజారాయి
●
జామ కాయల ధరలు దిగజారాయి. పెట్టుబడులు పెరిగినా ధరలు పెరగకపోవడం వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. పండు ఈగల ధాటికి తట్టుకోలేకపోతున్నాం. వీటిని నివారించలేక పోవడం వల్ల కాయలకు పురుగుపట్టి మార్కెటింగ్ చేసుకునేందుకు ఇబ్బందిగా మారింది.
– యాతం పెంచలరెడ్డి, రైతు, మొగళ్లూరు
పండు ఈగను నివారించాలంటే..
Comments
Please login to add a commentAdd a comment