నెల్లూరు (సెంట్రల్): తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, జిల్లాలో ప్రస్తుతం రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వరినారు మళ్లు సిద్ధం చేసుకున్న రైతులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త వినీత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానంగా నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని, వరిలో ఎక్కువగా నీరు నిల్వ ఉంటే పలు తెగుళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సలహాలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ గండం పొంచి ఉన్నందున వర్షం చూసుకుని నాట్లు వేసుకుంటే మంచిదని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment