నెల్లూరు రూరల్: బాల్య వివాహాలను అరికట్టేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల ముక్తిభారత్ ప్రచార ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని బుధవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణం నుంచి అధికారులు, విద్యార్థినులు వర్చువల్‌గా తిలకించారు. అనంతరం పీడీ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశా రు. కార్యక్రమంలో డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, బాలల సంరక్షణ అధికారి సురేష్, సోషల్ వెల్ఫేర్ డీడీ శ్రీనివాసులు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుబ్బారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నాగరాజ కుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment