ఓ సువర్ణ అధ్యాయం
జగన్‌మోహన్‌రెడ్డి
ఐదేళ్ల పాలన
నెల్లూరు (బారకాసు): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పరిపాలన ఒక సువర్ణ అధ్యాయమని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో కాకాణి నేతృత్వంలో పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత కార్యాలయ ప్రాంగణంలో ఉన్న దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి నేతలు ఒకరికొకరు తినిపించుకుని మిగిలిన అందరికీ పంచిపెట్టారు. కార్యకర్తలు, అభిమానులు కేరింతలతో పార్టీ జిల్లా కార్యాలయం దద్దరిల్లింది. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఇటువంటి తరుణంలో నిర్బంధాలను లెక్కచేయకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నారంటే ఆయన కారణజన్ముడని చెప్పవచ్చన్నారు. ప్రజల్లో ఆయన పట్ల ఉన్న ప్రేమ, అభిమానం ఎప్పటికీ తరగదన్నారు. రాజకీయంగా అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఈ రాష్ట్రానికి అరిష్టం, దురదృష్టమని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ఏరోజు ఎన్నికలు వచ్చినా మరలా జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ధృడమైన సంకల్పంతో ఉన్నారన్నారు. దీనికి కారణం ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, ఇచ్చిన హామీలు నెరవేర్చడం, రాజ్యాధికారం వైపు పేదలను అడుగులు వేయించడం వంటి పనులు చేయడమేనన్నారు. ఏది ఏమైనా 2029లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సామాజిక మార్పులు, సంక్షేమ పథకాల వల్లే ఆయనను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి వేసిన ప్రతి అడుగు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసునందతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
2029లో మళ్లీ
ముఖ్యమంత్రి కావడం ఖాయం
కూటమి ప్రభుత్వానివి
కక్ష సాధింపు చర్యలు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
జిల్లా కార్యాలయంలో ఘనంగా
వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment