డీల్ కుదిరింది
● మైకా, పల్స్‌ఫర్‌ను యజమానులే విక్రయించుకోవచ్చు
● మైకా క్వార్ట్ ్జ, క్వార్ట్ ్జ మాత్రం మైనింగ్ డాన్‌కే..
● నేడో.. రేపో అనుమతులు
సాక్షి ట్కాస్‌ఫోర్స్: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గనుల వ్యవహారం కొలిక్కి వస్తోంది. మైనింగ్ డాన్, మైనింగ్ యజమానుల మధ్య డీల్ కుదిరినట్లు తెలిసింది. దీంతో పనులు చేసుకునేందుకు విడతల వారీగా అనుమతులు మంజూరవుతున్నాయి. ఇటీవలే ఆ డాన్ ఓకే చెప్పడంతో నాలుగు గనులకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అలాగే మంగళవారం 9 గనులకు అనుమతులు వచ్చాయి. అవి కూడా ఇద్దరికి చెందినవే కావడమే విశేషం. నేడు లేదా రేపు కొన్ని ఫ్యాక్టరీలతోపాటు గనులు కలిపి మొత్తం 10 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయనున్నట్టు సమాచారం. మైకా, పల్స్‌ఫర్‌ను గనుల యాజమానులే విక్రయించుకోవాలని, తమకు మాత్రం క్వార్ట్ ్జ, మైకా క్వార్ట్ ్జ ఇవ్వాలంటూ డాన్ హుకుం జారీచేసినట్లు తెలుస్తోంది. అందుకు మైనింగ్ యజమానులు కూడా ఒప్పుకున్నట్టు సమాచారం.
అవి ఆయనకే..
క్వార్ట్ ్జ, మైకా క్వార్ట్ ్జ ఖనిజంపై మైనింగ్ డాన్ కన్ను పడింది. కూటమి ప్రభుత్వంలోని పెద్దలు ఆయన చెప్పినట్లు వింటున్నారు. తాజాగా డాన్ విధించిన షరతులకు యజమానులు అంగీకరించినట్లు తెలిసింది. పల్స్‌ఫర్, మైకాను సంబంధింత యజమానులే అమ్ముకునేలా డీల్ కుదిరినా వాటిని కూడా డాన్‌కే ముట్టజెప్పే విధంగా పావులు కదిపినట్లు సమాచారం. గతంలో నోటీసులు లేకుండా, జరిమానాలు విధించకుండా ఉన్న గనులకు అనుమతి మంజూరు చేస్తున్నట్లు అధికారికంగా తెలిసింది. కోర్టు వివాదం ఉన్నా కూడా ఓ గనికి అనుమతి ఇవ్వడం విశేషం.
రూ.105 కోట్ల నష్టం
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భూగర్భ గనులు ఏడు కాగా 140 మైకా, క్వార్ట్ ్జ గనులతోపాటు గూడూరులో 75 సిలికా ఇసుక గనులున్నాయి. వీటిపై వివిధ పరిశ్రమలతో కలిపి మరో వందకుపైగా నడుస్తున్నాయి. ఈ యూనిట్లన్నీ ఇక్కడ లభించే ముడి ఖనిజంపై ఆధారపడ్డాయి. మైనింగ్ పరిశ్రమపై రాయల్టీ రూపంలోనే ప్రతి నెలా రూ.15 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. గడిచిన ఏడునెలలుగా నెలకు రూ.15 కోట్ల వంతున రూ.105 కోట్లు రాకుండా పోయింది. ఇప్పుడు మూసి ఉన్న గనులకు అనుమతులు మంజూరు చేస్తుండడంతో కార్మికులకు కొంత ఊరట లభిస్తుంది. మైనింగ్ నిబంధనలు పాటిస్తారో లేక డాన్ చెప్పిన విధంగానే వ్యవహరిస్తారో తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment