ఉద్యోగుల భవిష్యనిధి సమావేశం నేడు
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు నగరంలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఆప్కే నిఖత్ 2.0 కార్యక్రమాన్ని ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ అమితాబ్ శుక్లా, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఎం.సురే ష్‌కుమార్ గురువారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
31న పింఛన్ల పంపిణీ
● డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి
నెల్లూరు (పొగతోట): సామాజిక పింఛన్లు ఈనెల 31వ తేదీన పంపిణీ చేసే లా చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమా రి ఎంపీడీఓలను ఆదేశించారు. గురువారం డీఆర్‌డీఏ కార్యాలయం నుంచి ఆమె ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 3,09,271 మంది లబ్ధిదారులకు రూ.130 కోట్లు నగదు పంపిణీ చేయనున్నామన్నారు. 31వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నగదు పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. 768 సచివాలయాల పరిధిని 13,181 క్లస్టర్లుగా విభజించి నగదు పంపిణీ చేయడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వృద్ధాప్య పింఛన్ తీసుకుంటూ భర్త మరణించిన భార్యకు సకాలంలో దరఖాస్తులు అందజేసి మరుసటి నెల నుంచే పింఛన్ అందజేయాలన్నారు. గత నెలలో పింఛన్ తీసుకోని లబ్ధిదారులకు రెండు నెలల నగదును అందజేస్తామన్నారు. వరుసగా రెండు నెలలు తీసుకోకపోయినా మూడు నెలలకు కలిపి నగదును ఒకే పర్యాయం అందజేస్తామని పేర్కొన్నారు.
సెలవుపై కలెక్టర్
నెల్లూరు(అర్బన్): కలెక్టర్ ఆనంద్ మూడు రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఇన్‌చార్జి కలెక్టర్‌గా జేసీ కార్తీక్‌కు బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్ తిరిగి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరవుతారు.
జోజికి డాక్టరేట్ ప్రదానం
నెల్లూరు (టౌన్): డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు కమతం జోజికి డాక్టరేట్ లభించింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ బీవీ మురళీధర్ పర్యవేక్షణలో ‘ది లీడర్ షిప్ రోల్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ స్టడీ’ అనే అంశంపై చేసిన పరిశోధనకు సంబంధించి ఆయనకు డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ గిరి, అధ్యాపకులు ఆయన్ను అభినందించారు.
వేటకు వెళ్లిన
మత్స్యకారుడి మృతి
ముత్తుకూరు: వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు పడవలో నుంచి జారిపడి మృతి చెందిన ఘటన కృష్ణపట్నంపోర్టులో బుధవారం రాత్రి జరిగింది. కృష్ణపట్నం ఎస్సై శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారం.. బోగోలు మండలం పాత బంగారుపాళెంకు చెందిన ప్రళయకావేరి పార్వతయ్య (56) మరో ఏడుగురితో కలిసి చేపల వేటకు పడవలో సముద్రంలోకి వెళ్లాడు. తుపాను హెచ్చరిక రావడంతో మంగళవారం పోర్టు సమీపానికి చేరారు. బుధవారం రాత్రి భోజనం చేసి, పడవలో నిద్రపోయాడు. ఉదయం నీటిలో శవమై తేలాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్టు ఎస్సై వెల్లడించారు.
వైద్యశాఖలో
డిప్యుటేషన్లు రద్దు
నెల్లూరు(అర్బన్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ప్రక్షాళన మొదలైంది. నూతన డీఎంహెచ్‌ఓగా సుజాత బాధ్యతలు చేపట్టిన రెండో రోజే తన మార్కును చూపించారు. గురువారం రాత్రి పలువురు డాక్టర్లను, వైద్య ఉద్యోగుల డిప్యుటేషన్లు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా 9 మంది డాక్టర్లకు స్థాన చలనం కలిగింది. హెల్త్ అసిస్టెంట్లు, హెల్త్ ఎడ్యుకేటర్, ఆఫీసు సబార్డినేటర్, ఫార్మసీ ఆఫీసర్, ఎఫ్‌ఎన్‌ఓ ఇలా మరో 15 మంది డిప్యుటేషన్లు రద్దు చేశారు. వారందరిని తక్షణమే కేటాయించబడిన స్థానా ల్లో జాయిన్ కావాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment