బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం మినుము రైతులకు నష్టాలు మిగిల్చింది. రబీ సీజన్‌ సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో సాగు చేసిన మినుము, పెసర, బొబ్బర, అలసంద తదితర పప్పు ధాన్యాల పైర్లు డిసెంబర్‌ చి | - | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం మినుము రైతులకు నష్టాలు మిగిల్చింది. రబీ సీజన్‌ సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో సాగు చేసిన మినుము, పెసర, బొబ్బర, అలసంద తదితర పప్పు ధాన్యాల పైర్లు డిసెంబర్‌ చి

Published Sun, Dec 29 2024 12:37 AM | Last Updated on Sun, Dec 29 2024 12:37 AM

బంగాళ

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో గత కొద

రబీలో కోతకు వచ్చిన పంట

● ఎడతెరిపి లేని వర్షాలకు

కాయల్లో మొలకలు

● జిల్లాలో 500 హెక్టార్లలో కోసిన

పంటకు నష్టం

● అధిక తేమతో పూత, కాయ కాయని పరిస్థితి

ఉదయగిరి/పొదలకూరు: జిల్లాలో రబీ సీజన్‌లో సాధారణంగా మినుము పంట 41,737 ఎకరాల్లో సాగవుతోంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంట గిట్టుబాటు ధరలు లేక చాలా వరకు సాగు విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుతం రబీలో 8,667 ఎకరాల్లోనే సాగు చేశారు. అది కూడా ఎక్కువగా ఉదయగిరి, వింజమూరు, పొదలకూరు, ఆత్మకూరు, కందుకూరు వ్యవసాయ సబ్‌ డివిజన్‌ల్లో వర్షాధార మెట్ట పైరుగా సాగు చేశారు. ఈ ఏదాది మెట్ట ప్రాంతాల్లో అక్టోబర్‌లో ముందుగా వానలు పడడంతో విత్తనం వేశారు. దీంతో ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. డిసెంబరు నెలంతా చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో పైరుకు ఎక్కువగా చీడ పీడలు ఆశించాయి. వీటి నివారణకు రైతులు భారీగా ఖర్చు పెట్టాల్సి రావడంతో పెట్టుబడి వ్యయం పెరిగింది. లాభాల సంగతి అటుంచి పెట్టిన పెట్టుబడులైనా వస్తాయనుకుంటే ప్రస్తుతం కురిసిన వర్షాలు ఆ ఆశలు కూడా లేకుండా చేసింది.

500 హెక్లార్లలో పంట నష్టం

గత నెల రోజులుగా ఫెంగల్‌ తుఫాన్‌, తీవ్ర అల్పపీడనాల ప్రభావంతో కురిసిన వర్షాలకు జిల్లాలో మెట్ట ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతకు వచ్చిన వరి, మినుము కొంత మేర దెబ్బతిన్నాయి. సాగులో ఉన్న 79 ఎకరాల మినుము పంటకు నష్ట పరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మరో 500 హెక్లార్ల వరకు పంట నష్టం వాటిల్లే అవకాఽశం ఉందని వ్యవసాయ అఽధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వరికుంటపాడు మండలంలో కోత దశలో ఉన్న 150 హెక్టార్లలో పైరుకు నష్టం వాటిల్లింది.

తేమ శాతం పెరిగి పంట నష్టం

పొదలకూరు వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిధిలో మినుము, పెసర పంటలు దెబ్బతిన్నాయి. పొలాల్లో పంటలు ఏపుగా వచ్చినా కాయలు ఏర్పడలేదని రైతులు వాపోతున్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా ఈ ప్రాంతంలో అపరాల సాగు బాగా తగ్గించారు. అయితే ప్రతి ఏడాది ఖరీఫ్‌ తర్వాత రబీలో కొందరు రైతులు మినుము, పెసర పంటల సాగు చేస్తున్నారు. పొదలకూరు వ్యవసాయ సబ్‌డివిజన్‌ పరిధిలో పొదలకూరు, రాపూరు, కలువాయి, చేజర్ల, మనుబోలు మండలాల్లో మనుబోలు మినహా మిగిలిన మండలాల్లో సుమారు 2 వేల ఎకరాలు పైబడి మినుము, పెసర పంటలను సాగు చేస్తున్నారు. మినుము, పెసరలో నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో అల్పపీడనాల ప్రభావంతో జడివానలు, ముసురు పట్టి తేమ శాతం పెరిగింది. పొలాల్లో నీరు బయటకు కాలువల ద్వారా పంపినా ఫలితం లేకుండాపోయింది. పైరు పెరిగినా కాయలు పూత, కాయలు రాలేదని అంకుపల్లి, చెన్నారెడ్డిపల్లి, మొగళ్లూరు తదితర గ్రామాల రైతులు వెల్లడిస్తున్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు మాధవరెడ్డి. వరికుంటపాడు మండలం గణేశ్వరపురం. ఇతను 5 ఎకరాల్లో మినుము సాగు చేశాడు. డిసెంబర్‌లో వర్షాలు ఎక్కువగా పడడంతో తెగుళ్లు, చీడపీడలు ఆశించి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. కోతకు వచ్చి కోసే దశలో ఉన్న పంట వానకు నాని కాయలు ఉబ్బిపోయాయి. ఇప్పటికే వర్షానికి నానిన పంట మీదనే కాయలు మొలకెత్తాయి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

పంట నష్టంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు

ఫెంగల్‌ తుఫాన్‌, ఆ తర్వాత అల్పపీడనాల ప్రభావంతో కురిసిన వర్షాలకు 29.46 హెక్టార్లలో మినుముకు నష్టం జరిగినట్లు గుర్తించి పరిహారం కోసం ప్రతిపాదనలు పంపాం. తాజాగా మరో 150 హెక్టార్లలో మినుమ దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా నివేదికలు వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం పంట దెబ్బతిన్న రైతులకు పరిహారం అందజేస్తాం. అపరాలు, వరికి సంబంధించి పంటల బీమా పథకం కోసం ఈనెల 31 వరకు ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. రైతులు సమీప రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలి. పంటలు నష్టపోయిన రైతులకు బీమా వచ్చే అవకాశం ఉంది.

– సత్యవాణి, జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి

No comments yet. Be the first to comment!
Add a comment
బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో గత కొద1
1/5

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో గత కొద

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో గత కొద2
2/5

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో గత కొద

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో గత కొద3
3/5

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో గత కొద

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో గత కొద4
4/5

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో గత కొద

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో గత కొద5
5/5

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో గత కొద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement