నేరాల కట్టడిలో అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ కృష్ణకాంత్
● చేజర్ల పోలీస్‌స్టేషన్లో తనిఖీ
చేజర్ల: నేరాలపై పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జి.కృష్ణకాంత్ సూచించారు. శనివారం చేజర్ల పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. మ్యాప్, క్రైమ్ చార్ట్, రికార్డులను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ అనుమానాస్పద మరణాలు, కుటుంబ తగాదాల వివరాలు, మిస్సింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. దొంగతనం కేసుల్లో కోల్పోయిన ప్రాపర్టీ రికవరీపై దృష్టి సారించాలన్నారు. నమో దైన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని సూచనలు చేశారు. ద్విచక్ర వాహనాల్లో వెళ్లేటప్పుడు పోలీస్ సిబ్బంది తప్పని సరి గా హెల్మెట్ ధరించాలన్నారు. స్కూల్స్, కళాశాలల్లో, ప్రజలకు సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమం, సమస్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జే తిరుమలరావు, ఏఎస్సై నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు.
వీఆర్‌కు వేదాయపాళెం
సీఐ కిశోర్‌కుమార్
● కొత్త సీఐగా శ్రీనివాసులురెడ్డి
బాధ్యతల స్వీకరణ
నెల్లూరు (క్రైమ్): నెల్లూరు వేదాయపాళెం పోలీసుస్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆర్‌ఎస్ కిశోర్‌కుమార్ రేంజ్ వీఆర్‌కు బదిలీ కాగా ఆయన స్థానంలో రేంజ్ వీఆర్‌లో ఉన్న వి. శ్రీనివాసులురెడ్డిని నియ మిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. వి.శ్రీనివాసులరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛాలి చ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఎస్పీ జి. కృష్ణకాంత్, ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర డీఎస్పీ డి. శ్రీనివాసరెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీనివాసులురెడ్డి 2004 బ్యాచ్ ఎస్‌ఐ. జిల్లాలోని కావలి, మనుబోలు, తడ పోలీసుస్టేషన్లలో ఎస్‌ఐగా పనిచేశారు. 2012లో సీఐగా ఉద్యోగోన్నతి పొంది నెల్లూరు రూరల్ సర్కిల్, నాయుడుపేట, ఒంగోలు తాలూకా, ఒంగోలు రూరల్ సీఐగా పనిచేశారు.
పారిశ్రామికవేత్తలుగా
తీర్చిదిద్దాలి
నెల్లూరు (పొగతోట) : స్వయం సహాయక గ్రూపు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి అన్నారు. డీఆర్‌డీఏ కార్యాలయంలో శనివారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి మండలం నుంచి ఐదుగురు వీఓఏలను ఎంపిక చేయాలన్నారు. నియోజకవర్గాల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అందులో పొదుపు మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు, దరఖాస్తులు, బ్యాంకు రుణాలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులను గుర్తించాలని, వారికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో జేడీఎం హైమావతి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ ఖయ్యుం తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ కులగణనపై
సోషల్ ఆడిట్
నెల్లూరురూరల్: ఎస్సీ కులగణనకు సంబంధించి సోషల్ ఆడిట్ చేస్తామని ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి శోభారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాలను ఉంచుతామని, ఈ లోపు ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయాల్లో వీఆర్‌ఓలకు సమర్పించాలని తెలిపారు. అభ్యంతరాలపై జనవరి 6వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని తెలిపారు. మూడు దశల్లో కలెక్టర్, ఆర్డీఓ, సంక్షేమశాఖ అధికారులు తనిఖీ చేస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment