సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం సాగిస్తాం
నెల్లూరు (వీఆర్సీసెంటర్): గిరిజన గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల సమస్యలు పరి ష్కారమయ్యే వరకు పోరాటం సాగిస్తూనే ఉంటామని గిరిజన గురుకుల అవుట్‌సోర్సింగ్ యూనియన్ నాయకులు భరత్, స్వాతి హెచ్చరించారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ సమీపంలో ఉన్న స్వతంత్ర పార్క్‌లో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. వీరు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష ధోరణి అవలంభిస్తోందన్నారు. గత 45 రోజులుగా విధులు బహిష్కరించి తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటాలు సాగిస్తున్నా అధికారులు, ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నా, తమకు ఉద్యోగ భద్రత లేదని, చాలీచాలని వేతనాలతో కటుంబ పోషణ కష్టతరంగా మారిందని వాపోయారు. తాము చేస్తున్న పోస్టులను డీఎస్సీలో కలిపి భర్తీ చేస్తామనడం అన్యాయమని, 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రమణ, కళ్యాణి, శ్రీనివాసులు, కృష్ణ, సునీల్, దిల్షాద్, సౌభాగ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment