నెల్లూరు (టౌన్): నగరంలోని కస్తూరిదేవి బాలికోన్నత పాఠశాలలో హెడ్మాస్టర్గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన టి.వనజపై వచ్చిన అభియోగాలను విచారించి ఈ నెల 31వ తేదీలోపు నివేదిక అందజేయాలని డీఈఓ ఆర్.బాలాజీరావు ఆదేశించారు. విచారణాధికారిగా నెల్లూరు ఎంఈఓ తిరుపాల్ను నియమించారు. నెల్లూరుకు చెందిన బి.సురేంద్రరెడ్డి విశ్రాంత హెచ్ఎం వనజ హయాంలో అభియోగాలు చేస్తూ దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి లోకేశ్ కు లేఖ పంపించారు. ఈ నేపథ్యంలో డీఈఓ విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment