నెలనెలా తప్పని వ్యయప్రయాసలు
జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 449, గ్రామీణ ప్రాంతాల్లో 2,485 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. గతంలో బియ్యం, పామాయిల్, కందిపప్పుతోపాటు బాలామృతం, బాలసంజీవని కిట్లు కూడా నేరుగా ప్రాజెక్ట్ సెంటర్ నుంచే ఆయా కేంద్రాలకు అందుతున్నాయి. కొంత కాలంగా బియ్యం, నూనె, కందిపప్పు మాత్రం రేషన్ షాపుల నుంచి సరఫరా చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ మూడు సరుకులు ప్రతి నెలా తెచ్చుకోవడానికి అంగన్‌వాడీ కార్యకర్తలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ మూడు సరుకులు ఒకేసారి రేషన్ షాపులకు సరఫరా కావడం లేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి వెళ్లి తెచ్చుకోవడానికి వ్యయప్రయాసలు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment