● గడువు పొడిగింపు
నెల్లూరు(క్రైమ్): నగరంలో ప్రీమియర్ లిక్కర్ స్టోర్ ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గ డువును ఈ నెల ఏడో తేదీ సాయంత్రం ఐదు గంట ల వరకు పొడిగిస్తూ జిలా ప్రాహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసులునాయుడు రీ నోటిఫికేషన్‌ను బుధవారం జారీ చేశారు. జిల్లాకు ఒక ప్రీమియం లిక్కర్ స్టోర్‌ను ప్రభుత్వం కేటాయించింది. దరఖాస్తుల స్వీకరణకు తుది గడువుగా గత నెల 31ను నిర్ణయించారు. అయితే దరఖాస్తు వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గడువును పొడిగించారు. ఆసక్తి గల వారు apsbcl. ap. gov. in నుంచి దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. నాన్ రీఫండబుల్ రుసుము రూ.15 లక్షలకు డీడీని తీసుకొని, పూర్తి చేసిన దరఖాస్తులతో దీన్ని జతపర్చి డీపీఈఓ కార్యాలయంలో సమర్పించాలన్నారు. వివరాలకు బీవీనగర్‌లోని ఎకై ్సజ్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment