కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర అసహనం
నెల్లూరు (బారకాసు): కూటమి ప్రభుత్వం వచ్చిఇ దాదాపు ఏడు నెలల గడుస్తున్నా.. ఏ శాఖ ద్వారా ప్రజలకు పనులు సక్రమంగా జరగడం లేదని, ముఖ్యంగా రెవెన్యూ శాఖలో లెక్కకు మించిన సమస్యలు పేరుకుపోయాయని ప్రజలంతా తీవ్ర అసహనంతో ఉన్నారని కేబినేట్ సమావేశంలో స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పడమే ఇందుకు నిదర్శమని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పార్టీ జిల్లా కార్యాలయానికి విచ్చేసి కాకాణిని కలిసి పూలమొక్కలు, పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలు కప్పి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ కొత్త సంవత్సర ప్రారంభంలోనే చంద్రబాబు మాట్లాడుతున్న మోసపు మాటలని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తామంటూ ఎన్నికల్లో ప్రచారాలు చేసి, అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడు నెలలు గడిచింది. ఇంకో 7 నెలల తర్వాత కొన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి విధివిధానాలను పరిశీలిస్తామనడం సిగ్గు చేటన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రజల సంక్షేమాన్ని ఆలోచించి ఎన్నికలకు ముందు ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలను సంపూర్ణంగా, సమర్థవంతంగా అమలు చేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ ప్రజలకు అండగా నిలిచిన విధానాన్ని, చంద్రబాబు మోసగిస్తున్న వైనాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎప్పుడు అవకాశం వస్తుందా? చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. జమిలి ఎన్నికలు 2027లోనే రానున్న నేపథ్యంలో ప్రజలందరూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని తిరిగి కోరుకుంటున్న పరిస్థితుల్లో కందుకూరుతో సహా 11 నియోజకవర్గాలతో పాటు, నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ స్థానాల్లో తిరుగులేని మెజార్టీతో విజయబావుటా ఎగురవేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని కాకాణి పిలుపునిచ్చారు. తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాకాణిని కలిసిని వారిలో పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డితో పాటు పలు ప్రాంతాలకు చెందిన పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు అందడం
లేదని ఆవేదన
ప్రభుత్వ శాఖల ద్వారా ఏ పనులు కావడం లేదు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment