● 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయాలపై ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు ఐదురోజులుగా దాడులు కొనసాగిస్తున్నారు. నాలుగు కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. 22 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప, చెంచులక్ష్మీపురం, వెంకటేశ్వరపురం, బోగోలు, తాళ్లూరు, నాగులవరం, కడనూతల, దగదర్తి మండలంలోని ఉలవపాడు గ్రామాల్లో సారా తయారు చేస్తున్నారని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు, డీపీఈఓ శ్రీనివాసులునాయుడికి సమాచారం అందింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా వారు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. సారాను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఆయా ప్రాంత ప్రజలకు సారా జోలికి వెళ్లొద్దని అవగాహన కల్పిస్తున్నారు. నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment