చందన, సీఎంఆర్ న్యూ ఇయర్ బంపర్ డ్రా
● మలేసియా ట్రిప్ విజేత కె.మోహన్
నెల్లూరు(బృందావనం): క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా నెల్లూరు సీఎంఆర్, చందన ప్రవేశపెట్టిన ఎక్స్‌ప్రెస్ సేల్లో భాగంగా న్యూ ఇయర్ బంపర్ డ్రా పెట్టారు. మలేసియా ట్రిప్ డ్రాను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆదివారం తీశారు. మర్రిపాడుకు చెందిన కె.మోహన్‌ను విజేతగా ప్రకటించారు. వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ విజేతగా నెల్లూరు చిల్డ్రన్స్‌పార్క్ రోడ్డులోని హరికృష్ణ నిలిచారు. క్రిస్మస్ బంపర్ డ్రాలో పడుగుపాడుకు చెందిన హనీఫా విజేతగా నిలువగా ఆమెకు కారును అందజేశారు. గత వీక్లీ డ్రా టీవీఎస్ జెస్ట్ విజేత ధన్విక్‌కు టీవీఎస్ స్కూటీని పంపిణీ చేశారు. అలాగే 35 మంది డైలీ డ్రా విజేతలకు గ్రైండర్, మిక్సీ, రైస్‌కుక్కర్, డిన్నర్ సెట్లు తదితరాలను ఇచ్చారు. శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ చందన, సీఎంఆర్ ప్రజల్లో మంచిపేరు సంపాదించుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో చందన అఽధినేత మావూరి శ్రీనివాసరావు, మోపూరు పెంచలయ్య, సుబ్బన్న, శైలేష్, మేనేజర్ వాసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment