గత నెలలో..
● ఏరులై పారుతున్న మద్యం
● జలదంకి మండలంలో ఓ వ్యక్తి మద్యం విక్రయిస్తుండగా ఎక్సైజ్ సిబ్బంది దాడులు చేశారు. 12 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.
● జలదంకి మండలంలోని తిమ్మసముద్రం గ్రామంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తుండగా ఎకై ్సజ్ సిబ్బంది దాడులు చేసి పది బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
● దుత్తలూరు మండలంలోని వేర్వేరు చోట్ల జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి 45 మద్యం బాటిళ్లు స్వాధీ నం చేసుకున్నారు.
● జలదంకి మండలంలోని హనుమకొండపాళెంలో ఓ వ్యక్తి అనధికారికంగా మద్యం విక్రయిస్తుండగా కావలి ఎకై ్సజ్ సిబ్బంది దాడులు చేసి 15 బాటిళ్లను సీజ్ చేశారు.
● మండల కేంద్రమైన కలిగిరిలో అనధికారికంగా మద్యం అమ్మకాలు జరుపుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 34 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
● జలదంకి మండలంలో కావలి ఎకై ్సజ్ సిబ్బంది దాడులు నిర్వహించి 12 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు.
● అనుమసముద్రంపేట మండలంలో ఓ వ్యక్తి అక్రమంగా 18 మద్యం బాటిళ్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
ఈనెలలో..
● బెల్టు దుకాణాలపై ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నెల్లూరు వన్ అధికారులు దాడులు చేశారు. వైఎస్సార్ నగర్‌లో ఓ మహిళ నుంచి 11 క్వార్టర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
● ఎకై ్సజ్ నెల్లూరు – 1 అధికారులు వావిలేటిపాడులోని బెల్టు దుకాణంపై దాడులు చేసి ఓ వ్యక్తి తొమ్మిది క్వార్టర్‌ల మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.
నెల్లూరు(క్రైమ్): కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీతో అధికారిక షాపులు, బెల్టు షాపుల ఏర్పాటుతో ఊరూవాడా మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి సర్కార్ లిక్కర్‌ను మాత్రం ప్రతి వీధికి తీసుకెళ్లి ప్రజలను బానిసలుగా మార్చి ఇళ్లు, ఒళ్లును గుల్ల చేస్తోంది. సంపద సృష్టిస్తామని ఎన్నికల ముందు పదేపదే చెప్పిన కూటమి పెద్దలు ఈ తరహాలో జనం జేబుల్ని కొల్లగొట్టి ఖజానా నింపుకొంటున్నారన్న విమర్శలున్నాయి. బెల్టు షాపులు, అక్రమ రవాణాను నిలువరించాల్సిన ఎకై ్సజ్ అధికారులు ఒత్తిళ్ల కారణంగా అడపాదడపా దాడులకే పరిమితమయ్యారు. దీంతో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంటోంది. యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తే బెల్టు షాపులకు అడ్డుకట్ట పడుతుంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాల్లేవు.
ఇష్టారాజ్యంగా..
జిల్లాలో అధికారికంగా 182 మద్యం దుకాణాలు, 55 బార్ అండ్ రెస్టారెంట్లున్నాయి. అధిక శాతం దుకాణాలు అధికార పార్టీ నేతలవే కావడంతో ఎకై ్స జ్ అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. మద్యం షాపుల్లో ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లలో పది నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే విక్రయాలు సాగించాల్సి ఉంది. వ్యాపారులు నిబంధనలకు నీళ్లొదిలారు. అనేక ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే విక్రయాలు సాగుతున్నాయి.
విచ్చలవిడిగా పర్మిట్‌రూమ్‌లు
నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు సాగించినా, బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసినా కేసులు నమోదు చేయడంతోపాటు దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో కూటమి నేతలు చేస్తున్న పనుల గురించి ఆయనకు తెలియంది కాదు. మీడియా ముందు హడావుడి చేశారని విమర్శలున్నాయి. మద్యం దుకాణాల పక్కనే మినీబార్లను తలపించేలా పర్మిట్‌రూమ్‌లను తెరిచారు. ఇక బెల్టు షాపులు గ్రామ, గ్రామానా పుట్టుకొచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 1,500 పైచిలుకు బెల్టు షాపులున్నట్లు సమాచారం. వాటిల్లో క్వార్టర్‌పై రూ.30 నుంచి రూ.50 అదనంగా వసూలు చేస్తుండగా.. కొందరు సిట్టింగ్‌రూమ్‌లు ఏర్పాటు చేసి మందుబాబులు తాగేందుకు చోటు కల్పించారు.
వాటిల్లో కూడా..
జిల్లాలో చిన్నా, పెద్ద కలిపి 300కు పైగా ధాబాలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయించాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది. ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. అన్ని హంగులతో ధాబాలను తీర్చిదిద్దారు. మద్యం మీరు తెచ్చుకున్నా సరే.. లేదంటే సిబ్బందే సమకూరుస్తారని నిర్వాహకులు ఆఫర్లు ఇస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం తాగిస్తున్నారు.
అడపాదడపా..
నిబంధనల ఉల్లంఘనులపై కేసులు నమోదు చేయాల్సిన ఎకై ్సజ్ అధికారులు మొక్కుబడి చర్యలకే పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్, స్క్వాడ్ అధికారులు అడపాదడపా దాడులకే పరిమితమైనట్లు తెలుస్తోంది. బెల్టు విక్రయాలపై దాడులు చేసి నిందితుల అరెస్ట్‌లతో సరిపెట్టుకుంటున్నారు. నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు 380 కేసులు నమోదు చేసి 382 మందిని అరెస్ట్ చేశారు. 879.2 లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ బాటిల్ ఏ షాపు నుంచి వచ్చింది? ఎవరు సరఫరా చేశారు? అనే మూలాల్లోకి వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది. అనేక దుకాణాల నుంచే బె ల్టుకు మద్యం సరఫరా అవుతున్నట్లు సమాచారం. అయితే ఇంత వరకు ఒక్క దానిపై కూడా కేసు నమోదు కాకపోవడం గమనార్హం.
కూటమి ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. సీఎం చంద్రబాబు వల్ల వీధికో బెల్టు షాపు ఏర్పాటైంది. వేలమంది మహిళలు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మద్యం షాపుల నుంచి బెల్టు షాపులకు బాటిళ్లను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి నేతల ప్రోత్సాహంతో జిల్లాలో బెల్టు దుకాణాల ద్వారా మద్యం ఏరులై పారుతున్న విషయం తెలిసినా ఒత్తిళ్ల కారణంగా సంబంధిత అధికారులు మొక్కుబడి దాడులకే పరిమితమైనట్లు విమర్శలున్నాయి.
జిల్లాలో 1,500కు పైగా బెల్టు షాపులు
ప్రజల జీవితాలతో
కూటమి నేతల చెలగాటం
మొక్కుబడి దాడులకే ఎకై ్సజ్ శాఖ పరిమితం
దాడులు చేస్తున్నాం
నిబంధనల ఉల్లంఘనులపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. బెల్టుషాపులను ఉపేక్షించేది లేదు. నిరంతరం దాడులు చేస్తున్నాం. ఇప్పటి వరకు 380 కేసులు నమోదు చేసి 382 మందిని అరెస్ట్ చేశాం. నిబంధనలు పాటించని వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం.
– టి.శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్
Comments
Please login to add a commentAdd a comment