● మహిళ గొలుసు తెంపుకెళ్లిన దుండగుడు
నెల్లూరు(క్రైమ్): ఆస్పత్రిలోని ఆయాను మాటల్లో దించి ఆమె మెడలోని గొలుసును గుర్తుతెలియని దుండగుడు తెంపుకెళ్లాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు గాంధీ నగర్ సమీపంలో వీఎంఆర్ నగర్‌కు చెందిన బుజ్జమ్మ మద్రాస్ బస్టాండ్ సమీపంలోని ఓ నర్సింగ్‌హోంలో ఆయాగా పనిచేస్తోంది. ఈనెల 4వ తేదీ రాత్రి ఆమె హాస్పిటల్‌కు వెళ్లింది. అక్కడికి వచ్చిన గుర్తుతెలియని యువకుడు ఆమెతో మాటలు కలిపాడు. ఒక్కసారిగా మహిళ మెడలోని 16 గ్రాముల బంగారు గొలుసును తెంపుకెళ్లాడు. బాధితురాలు చిన్నబజారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. నిందితుడు హిందీలో మాట్లాడుతున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆదివారం కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment