సీతారామపురం: ఉదయగిరి – సీతారామపురం జాతీయ రహదారి మార్గంలోని పోలంగారిపల్లి గ్రామ రోడ్డు సెంటర్ వద్ద ఆదివారం రాత్రి రెండు మోటార్‌బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో సీతారామపురం బెస్తకాలనీకి చెందిన వాసు, సోంపల్లి గ్రా మానికి చెందిన రమేష్, లక్ష్మయ్యలు గాయపడ్డారు. స్థానికు లు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
కండలేరులో 56.920 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 56.920 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి 700 క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,050, లోలెవల్ కాలువకు 10, హైలెవల్ కాలువకు 110, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఈఈ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment