ఎడాపెడా తాగేశారు..!
నెల్లూరు(క్రైమ్): నూతన సంవత్సర వేడుకల్లో మద్యం ఏరులైపారింది. రూ.22 కోట్ల మేర మద్యాన్ని తాగేశారు. నూతన ఏడాదిని పురస్కరించుకొని మంగళవారం అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు మందుబాబులతో కిటకిటలాడాయి. జిల్లాలో 182 వైన్ షాపులు, 50 బార్లు ఉన్నాయి. 165 మద్యం దుకాణాలకు నెల్లూరు దేవరపాళెంలోని ఐఎమ్మెల్ డిపో నుంచి.. మిగిలిన 17 దుకాణాలకు ఒంగోలు డిపో నుంచి మద్యం సరఫరా అవుతుంది. జిల్లాలో సగటున రోజుకు రూ.నాలుగు కోట్ల మద్యం విక్రయాలు సాగుతుంటాయి. నూతన సంవత్సర వేడుకల్లో ఎకై ్సజ్ శాఖ ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావించింది. దీనికి తగిన విధంగా మంగళ, బుధవారాల్లో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గత నెల 30 నుంచే విక్రయాలు జోరందుకున్నాయి. సోమవారం రూ.12.4 కోట్లు.. మంగళవారం రూ.6.4 కోట్లు, బుధవారం రూ.3.2 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి.
భారీగా మద్యం విక్రయాలు
మూడు రోజుల్లో రూ.22 కోట్ల వ్యాపారం
Comments
Please login to add a commentAdd a comment