ఎన్‌ఎంసీలో సూపరింటెండెంట్ల బదిలీ
నెల్లూరు(బారకాసు): పరిపాలన సౌలభ్యం కోసం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని పలు విభాగాల్లో సూపరింటెండెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న పలువురి అధికారులను బదిలీ చేస్తూ కమిషనర్ సూర్యతేజ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఎన్‌ఎంసీలోని హౌసింగ్ ఫర్ ఆల్ సెక్షన్ల సూపరింటెండెంట్ సిద్ధిక్‌ను మేయర్ పేషీ సూపరింటెండెంట్‌గా నియమించారు. ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో ఇన్‌చార్జి సూపరింటెండెంట్ పనిచేస్తున్న జి.బాలసుబ్రహ్మణ్యంను తాత్కాలికంగా హౌసింగ్ ఫర్ ఆల్ సెక్షన్ల ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా నియమించారు. లీగల్ సెల్ విభాగ సూపరింటెండెంట్ ఎ.ప్రవీణ్‌ను తాత్కాలికంగా ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా నియమించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయని కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.
సర్వీస్ ప్రొవైడర్ల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ
నెల్లూరు (బారకాసు): జిల్లాలోని నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు కావలి, కందుకూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాల్టీల్లో ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఏసీ, గీసర్, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ తదితర వాటిని రిపేరు చేస్తూ సేవలందించే వారితో పాటు బ్యూటీషియన్, బార్బర్ వర్గాల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నగర పాలక కమిషనర్ సూర్యతేజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారికి ఎన్‌ఎస్‌డీసీ, ఎస్‌డీసీ, ఎన్‌ఏసీల ద్వారా నైపుణ్యా భివృద్ధి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్‌తో పాటు అర్హత పొందిన వారికి హోమ్ ట్రయాంగిల్ అన్‌లైన్ ప్లాట్‌ఫాం ద్వారా వీరికి ఆన్‌బోర్డు ద్వారా జీవనోపాధి కల్పిస్తామన్నారు. ఆయా సేవలు అందించే ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 4వ తేదీన శనివారం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో జరిగే రిజిస్ట్రేషన్ మేళాకు హాజరై అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని కమిషనర్ కోరారు. అర్హత ఉన్న అభ్యర్థులందరూ తమ రేషన్, ఆధార్, పాన్ కార్డులతో పాటు బ్యాంకు పాస్‌బుక్, విద్యార్హత సర్టిఫికెట్ జెరాక్స్, రెండు ఫొటోలు తీసుకుని హాజరు కావాలని తెలియజేశారు.
వీఎస్‌యూలో
జాబ్‌మేళా రేపు
వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమసింహపురి యూనివర్సిటీ(వీఎస్‌యూ)లో ఈ నెల 3న ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు వీఎస్‌యూ ఇన్‌చార్జి వీసీ విజయభాస్కరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. 18– 35 ఏళ్లలోపు, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ చదివిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇతర వివరాలకు 9573482179 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
పరీక్ష ఫీజును
ఆరులోపు చెల్లించాలి
నెల్లూరు (టౌన్): ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్ష ఫీజును ఈ నెల ఆరులోపు చెల్లించాలని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.25 అపరాధ రుసుముతో 8 వరకు, రూ.50 అపరాధ రుసుముతో తొమ్మిది వరకు, తత్కాల్ రుసుముతో పది వరకు గడువుందని చెప్పారు. వివరాలకు ఏపీఓఎస్సెస్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
డీఆర్పీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
నెల్లూరు (పొగతోట): జిల్లా గ్రామీణాభివృద్ధిఽ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థల పీఎం ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రొసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకం ద్వారా జిల్లాలో రిసోర్స్ పర్సన్ల (డీఆర్పీ) ఎంపిక కోసం ఈ నెల ఐదులోపు దరఖాస్తు చేసుకోవాలని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజకుమారి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రతి మండలంలో డీఆర్పీని రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నామని వివరించారు. ఎంపికై న డీఆర్పీలు ఆయా మండలాల్లో పారిశ్రామికవేత్తలను గుర్తించడం, పథకాలను వివరించడం, ప్రాజెక్ట్ రిపోర్టులను సిద్ధం చేయడం, బ్యాంకులతో సమన్వయపర్చి రుణాలు మంజూరయ్యేలా సహకరించడం తదితరాల్లో పాల్గొననున్నారని వివరించారు. వివరాలకు 0861 – 2321261, 89851 20012 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment