గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్ తదితరులు ఇంటింటికీ వెళ్లి జ్వరాలు, ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయాననే అంశంపై సర్వే చేసేవారు. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ అటకె క్కింది. అప్పట్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో ఇళ్ల వద్దే వృద్ధులు, మంచాన ఉన్న వారు, పురిటి పిల్లలు, మహిళలకు వైద్యసేవలందించే వారు. ఈ విధానంతో పల్లె ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు ఇంటి వద్దే లభించేవి. ఇప్పుడా విధానాన్నే మార్చేశారు. అసలు ప్రజల జ్వరాలపై వైద్యశాఖ పట్టించుకోవడాన్ని మానేసిందనే చెప్పాలి. సీహెచ్‌సీల్లో మందుల కొరత వేధిస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని మంచి వైద్యసేవలందించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment