పెంచలకోనకు పోటెత్తిన భక్తులు
కల్యాణాన్ని నిర్వహిస్తున్న అర్చకులు
రాపూరు: నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనకు భక్తులు బుధవారం పోటెత్తారు. పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, ఆంజనేయస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలంకార మండపంలో దేవదేవేరుల ఉత్సవ విగ్రహాలను పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేసి ప్రసాదాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment