టీడీపీ పాలనలో అప్పుడు..ఇప్పుడూ దగా
టీడీపీ అధికారంలోకి రావడంతో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రుణ వితరణలో బ్యాంకర్ల ప్రాధాన్యత మారింది. రుణాల మంజూరులో బ్యాంకర్లు వెనకడుగు వేసినట్లు స్పష్టమవుతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి మస్తుగా రుణాలు అందించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ముందే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ ఏడాదిలో జిల్లాలోని 392 బ్యాంకు శాఖల ద్వారా రూ.18006.2 కోట్ల రుణాల మంజూరు లక్ష్యాన్ని నిర్ణయించింది. ఇందులో పంటలు సాగు చేసే రైతులకు రూ.8,929.02 కోట్లు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు రూ.9,077.18 కోట్లు అందించాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం మారడంతో ఉదారంగా రుణ వితరణకు బ్యాంకర్లు విముఖత చూపిస్తున్నారని.. ఇప్పటి వరకు జరిగిన రుణాల మంజూరు గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయానికి అందించే రూ.8,929.02 కోట్లల్లో ఖరీఫ్ సీజన్‌లో రూ.3,839.47 కోట్లు, రబీలో రూ. 5,089.55 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యం. అయితే ఈ రెండు సీజన్లకు సంబంధించి డిసెంబరు ఆఖరు వరకు కేవలం రూ.5666.59 కోట్లు మంజూరు చేశారు. ఇక అనుబంధ రంగాలకు సంబంధించి ఈ ఏడాదిలో రూ.9,077.18 కోట్ల రుణ వితరణ లక్ష్యం కాగా, దీర్ఘకాలిక రుణాలుగా రూ.3,114.43, ఎంఎస్‌ఎంఈ రుణాలు రూ.3,339.68 కోట్లు మొత్తం రూ.6,454.11 కోట్లు మంజూరు చేశారు. ఈ ఏడాదిలో మొత్తం రూ.18006.2 రుణ లక్ష్యంలో ఇప్పటి వరకు రూ.12,120.7 కోట్ల రుణాలే మంజూరు చేయడం విశేషం. రుణ లక్ష్యంలో 67 శాతమే రుణవితరణ జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment