సీపీడబ్ల్యూ స్కీమ్‌లు సక్రమంగా నిర్వర్తించాలి
● జెడ్పీ సీఈఓ విద్యారమ
పొదలకూరు : సీపీడబ్ల్యూ స్కీమ్‌లను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సక్రమంగా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ విద్యారమ ఆదేశించారు. పొదలకూరు మండలంలో 12 గ్రామాలకు తాగునీటిని అందించే కండలేరు సీపీడబ్ల్యూ స్కీమ్‌ను గురువారం సీఈఓ పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ వారానికి రెండు సీపీడబ్ల్యూ స్కీమ్స్‌ను పరిశీలించాల్సిందిగా పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించినట్లు చెప్పారు. ముందుగా పొదలకూరుకు తాగునీటిని సరఫరా చేసే స్కీమ్‌ను తనిఖీ చేశామన్నారు. పొదలకూరు స్కీమ్ పనితీరు, స్కీమ్ నిర్వహణ కాంట్రాక్టర్ వివరాలు సీఈఓ అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలంలో కూడా సక్రమంగా స్కీమ్ నుంచి తాగునీటిని అందజేయాల్సిందిగా సూచించారు. ఒక్క రోజు కూడా సీపీడబ్ల్యూ స్కీమ్ వల్ల ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహణ ఉండాల్సిందిగా సూచించారు. సీఈఓ వెంట ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ రెడ్డయ్య, డీఈ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ డీవీ నరసింహారావు, ఏఈలు కసనానాయక్, రమేష్, దుగ్గుంట ఎంపీటీసీ సభ్యుడు కేతు రామిరెడ్డి, సర్పంచ్ వెంకటరమణయ్య తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment