ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం ఏకగ్రీవ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం ఏకగ్రీవ ఎన్నిక

Published Sun, Jan 19 2025 11:50 PM | Last Updated on Sun, Jan 19 2025 11:50 PM

ప్రభు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం ఏకగ్రీవ ఎన్నిక

నెల్లూరు (టౌన్‌): స్థానిక డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో ఆదివారం జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెజిటెడ్‌ అధ్యాపకుల సంఘ సమావేశం జరిగింది. సంఘ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా కోవూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు కె.రామప్రసాద్‌, జిల్లా యూనిట్‌ కార్యదర్శిగా కందుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు రాజగోపాల్‌బాబు, జిల్లా యూనిట్‌ ఉపాధ్యక్షుడిగా డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు వి. చెంచురామయ్య, కోశాధికారిగా డీకేడబ్ల్యూ కళాశాల అధ్యాపకుడు టి.రంజని, జాయింట్‌ సెక్రటరీగా విడవలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు రవిచంద్రారెడ్డిలను ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకుడిగా విడవలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు శ్రీరమణమూర్తి వ్యవహరించారు. సభ్యులు మాట్లాడుతూ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

బొందిలి సంఘీయులను ఓబీసీలో చేర్చాలి

సంఘ రాష్ట్ర నేతల డిమాండ్‌

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): రాష్ట్రంలో బొందిలి కులాన్ని బీసీ–బీగా చేర్చారని, కానీ కేంద్రంలో ఓపెన్‌ కేటగిరీలో ఉంచడం అన్యాయమని బొందిలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.కృష్ణసింగ్‌, తమిళనాడు బొందిలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జై సింగ్‌, బొందిలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాస్‌సింగ్‌ తెలిపారు. నగరంలో కేవీఆర్‌ పెట్రో లు బంక్‌ దగ్గర ఉన్న ఏఎల్‌రావు కల్యాణ మండపంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ బొందిలి సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొలుత రాజపుత్ర యోధుడు మహారాణా ప్రతాప్‌సింగ్‌ చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించా రు. రాష్ట్ర నేతలు మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2008లో బొందిలి కులస్తులను బీసీ–బీ కేటగిరీలో చేర్చారన్నారు. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది వరకు బొందిలి సంఘీయులు ఉన్నారన్నారు. గతం రాష్ట్ర ప్రభు త్వం బొందిలి సంఘీయుల కోసం కార్పొరేషన్‌ ఏర్పా టు చేసిందన్నారు. బొందిలి సంఘాన్ని బలోపేతం చేయడంతోపాటు ఐక్యతగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

బొందిలి సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గం

ఆంధ్రప్రదేశ్‌ బొందిలి సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నెల్లూరు కృష్ణసింగ్‌ (నెల్లూరు), ఎం.మోహన్‌సింగ్‌ (తిరుపతి), గౌరవ అధ్యక్షులుగా కె.శంకర్‌సింగ్‌ (గుంటూరు), లలితాబాయి (వైఎస్సార్‌), కోశాధికారిగా జి.సునీతాబాయి, ఉపాధ్యక్షుడిగా బి. సత్యంబాబుసింగ్‌, కమిటీ సభ్యులుగా ధర్మనారాయణ్‌సింగ్‌, పి.శ్రీనివాస్‌సింగ్‌, మహేష్‌సింగ్‌ తదితరులను ఎన్నుకున్నారు. జిల్లా బొందిలి సంఘం కమిటీలో అధ్యక్షుడిగా ఆర్‌.శ్రీనివాస్‌సింగ్‌, కార్యదర్శిగా ఎ.నాగేంద్రసింగ్‌, కోశాధికారిగా చంద్రబాన్‌సింగ్‌, గౌరవ అధ్యక్షుడిగా ఆర్‌.కోటిసింగ్‌, ఉపాధ్యక్షులుగా వై.సాయిప్రసాద్‌ సింగ్‌, వై.శివవాసుదేవ్‌సింగ్‌, ఆర్‌.నవీన్‌కుమార్‌సింగ్‌, కార్యనిర్వాహక అధ్యక్షులుగా కె.సురేష్‌సింగ్‌, ఎన్‌.మల్లికార్జున్‌సింగ్‌, సంయుక్త కార్యదర్శిగా ఎన్‌.చంద్రపాల్‌సింగ్‌, న్యాయసలహాదారుగా ఆర్‌.బాలేంద్రసింగ్‌లను ఎన్నుకున్నారు. ఎన్నికల నిర్వాహకులుగా తరుణ్‌సింగ్‌ వ్యవహరించారు.

అయ్యో... ఆలివ్‌రిడ్లీ

గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తూ మృతి

బిట్రగుంట: బోగోలు మండలం తాటిచెట్లపాళెం సమీపంలో తీరంలో భారీగా ఆలివ్‌రిడ్లీ తాబేళ్ల కళేబరాలు కనిపిస్తున్నాయి. సంతానోత్పత్తి కోసం వేల కి.మీ. ప్రయాణించి తీరానికి వస్తున్న తాబే ళ్లు మధ్యలో గాయపడి మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల ప్రతిరోజూ పదుల సంఖ్యలో తాబేళ్లు చనిపోయి కనిపిస్తున్నాయి. థాయిలాండ్‌, మలేసియా, ఇండోనేషియా తీరాల్లో ఎక్కువగా సంచరించే అరుదైన ఆలివ్‌రిడ్లీ తాబేళ్లు సంతానోత్పత్తి కోసం నవంబర్‌–మార్చి మధ్యలో సుమారు 20 వేల కి.మీ. ప్రయాణించి ఒడిశా, ఏపీలోని తీర ప్రాంతాలకు చేరుకుంటాయి. రాష్ట్రంలోని తీర ప్రాంతాలకు ఎక్కువగా జనవరిలోనే వీటి రాక అధికంగా ఉంటుంది. తీరంలో గుడ్లు పెట్టి అవి పిల్లలుగా మారిన తర్వాత తిరిగి వెళుతుంటాయి. వేల కి.మీ. ప్రయాణించి తీరానికి వచ్చే క్రమంలో పడవలు, వలల కారణంగా గాయాలపాలవుతున్న తాబేళ్లు తీరానికి చేరిన తర్వాత మృత్యువాత పడుతున్నాయి. సముద్ర జలాల్లో కాలుష్యం కారణంగా జబ్బు పడుతున్న తాబేళ్లు కూడా తీరానికి వచ్చి చనిపోతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం ఏకగ్రీవ ఎన్నిక 1
1/1

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం ఏకగ్రీవ ఎన్నిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement