యోగి వేమన సాక్షాత్ భగవత్స్వరూపమే
● ఘనంగా యోగి వేమన భగవాన్ జయంతి
నెల్లూరు(బృందావనం): యోగి వేమన సాక్షాత్ భగవత్స్వరూపమే అని త్రైత సిద్ధాంతం–ప్రబోధసేవా సమితి ఇందూ జ్ఞానవేదిక నెల్లూరు కమిటీ అధ్యక్షుడు డి.సురమౌళి అన్నారు. జ్ఞానవేదిక నెల్లూరు కమిటీ ఆధ్వర్యంలో యోగివేమన జయంతిని ఆదివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. అనిల్‌గార్డెన్స్‌లో ప్రత్యేక వేదిక నిర్మించి యోగి వేమన భగవాన్ ప్రతిమను కొలువుదీర్చి పూజలు చేశారు. అనిల్‌గార్డెన్స్ నుంచి మద్రాస్ బస్టాండ్ కేవీఆర్ పెట్రోలు బంక్ మీదుగా తిరిగి అనిల్‌గార్డెన్స్ వరకు యోగి వేమన భగవాన్ ప్రతిమతో నగరోత్సవాని నిర్వహించారు. రెడ్ల ఐక్యవేదిక నెల్లూరు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిర్మల నరసింహారెడ్డి, డాక్టర్ బీవీరెడ్డి వేమన భగవాన్ ప్రతిమకు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో త్రైత సిద్ధాంతం–ప్రబోధసేవా సమితి నెల్లూరు సభ్యు లు పెంచల నరసయ్య, ఎంసీ.సుధాకర్ ఆచారి, రత్నమాచారి, జి.ప్రసాద్, జి.నరసింహప్రసాద్, శేషా రత్న మ్మ, శ్రీజ, డీవీ ప్రసాద్, శేఖర్, రమాదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment