కలెక్టర్ నివేదికలు..
కమిషనర్ ఆదేశాలు బుట్టదాఖలు
2022–23 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో కొలతల్లో తేడాలు, మస్తర్లలో అక్రమాలు ఉన్నట్లు నిర్ధారించారు. ముగ్గురు ఎంపీడీఓలు, ఉపాధి హామీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జెడ్పీ సీఈఓను ఆదేశించారు. ఎంపీడీఓలపై చర్యలు తీసుకునే స్థాయి జెడ్పీ సీఈఓకు లేకపోవడంతో పంచాయతీరాజ్ కమిషనర్‌కు నివేదికలు పంపించాల్సి ఉంది. నివేదికలు పంపించడంలో జాప్యం జరుగుతోంది. అధికార పార్టీ నాయకుల సిఫారసు, ఒత్తిళ్లతో ఎంపీడీఓలపై చర్యలకు జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. కలువాయి మండలం ఉపాధి హామీ పనుల్లో రూ.26 లక్షలు అవినీతికి పాల్పడిన సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అంతకు మించి రాపూరు, సైదాపురంతోపాటు ఇతర మండలాల్లో రూ.50 లక్షలకు మించి పైగా అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీల్లో నిర్ధారించారు. అయితే ఆయా మండలాల సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తే.. అవినీతి భోక్తలకు అధికారులు భరోసా కల్పిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment