పెద్దాస్పత్రిలో ఆర్‌ఐసీయూ ప్రారంభం
నెల్లూరు(అర్బన్): ఆధునిక సౌకర్యాలతో వెంటిలేటర్, ఇతర క్రిటికల్ కేర్ పరికరాలతో ఏర్పాటు చేసిన రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను (ఆర్‌ఐసీయూ) తొలిసారిగా పెద్దాస్పత్రిలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దాస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ గంగాధర్, ఆర్థోపెడిక్ విభాగం ప్రొఫెసర్ మస్తాన్‌బాషా మాట్లాడుతూ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఇతర ప్రైవేట్ ఆస్పత్రుల్లో తీవ్ర అనారోగ్యానికి గురై సీరియస్ అయిన కేసులు టెర్షయరీ ఆస్పత్రిగా ఉన్న పెద్దాస్పత్రికి నిత్యం వస్తున్నాయన్నారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా మత్తు డాక్టర్ల పర్యవేక్షణలో ఈ ఆర్‌ఐసీయూ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఖరీదైన ఈ వైద్యాన్ని రోగులు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పెద్దాస్పత్రిలో వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనస్థీషియా విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ శ్రీనివాసరావు, ప్రొఫెసర్ డాక్టర్ శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment