ప్రజలకు మంచి జరగాలి
● మాజీ మంత్రి కాకాణి
నెల్లూరు(బారకాసు): నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆకాక్షించారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కొత్త ఏడాది అందరికీ సుఖసంతోషాలు, శాంతి, అభివృద్ధిని అందించాలన్నారు.
కొత్త ఉషస్సులతో..నూతన సంవత్సరం
● మాజీ ఎంపీ మేకపాటి
నెల్లూరు (బారకాసు): జిల్లా ప్రజలు నూతన సంవత్సరంలో కొత్త ఉషస్సులతో సంతోషంగా గడపాలని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభిలాషించారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో సైతం అన్ని రకాల సామాజిక రుగ్మతలపై పోరాటాన్ని విజయ వంతంగా కొనసాగించడానికి అందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment