నెల్లూరు(టౌన్): విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నరేంద్ర డిమాండ్ చేశారు. మంగళవారం ముత్తుకూరు రోడ్డులోని చంద్రారెడ్డి డిగ్రీ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నేటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయలేదన్నారు. విద్యాదీవెన, వసతి దీవెనల బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా రూ.3,480 కోట్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనకు శ్రీకారం చుడతామని తెలిపారు. నాయకులు శివ, పవన్, బాలాజీ, శ్యామ్‌కృష్ణ, వెంకటేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment