నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): కులగణనకు సంబందించి గ్రామ, వార్డు సచివాలయాల్లో డిస్‌ప్లే చేసిన వివరాల వెరిఫికేషన్ చేసే గడువును జనవరి 7వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికార అధికారిణి కె.శోభారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ కుల గణనకు సంబందించి సోషల్ ఆడిట్ చేస్తున్నామని తెలిపారు. వాటి వివరాలను డిస్‌ప్లే చేసినందున గ్రామ వార్డు సచివాలయాల వద్ద ఎస్సీ ప్రజానీకం పరిశీలించుకోవచ్చన్నారు.
ఇన్‌చార్జి జిల్లా రిజిస్ట్రార్‌గా బాలాంజనేయులు
నెల్లూరు సిటీ: నెల్లూరు జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇన్‌చార్జ్ జిల్లా రిజిస్ట్రార్‌గా ప్రకాశం జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న రవివర్మ మంగళవారం పదవీ విరమణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment