ముగ్గురు థంబ్ వేయాలి..
అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సరుకులకు సంబంధించి అంగన్‌వాడీ కార్యకర్త, రేషన్ డీలర్, వీఆర్వో లేదా వీఆర్‌ఏ థంబ్ వేస్తేనే సరుకులు ఇస్తారు. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే బియ్యం, నూనె, కందిపప్పులకు ప్రత్యేకించి డీలర్లు ఎంఎల్‌ఎస్ పాయింట్లకు వెళ్లి థంబ్ వేస్తే కానీ షాపులకు సరఫరా కావు. ఆ డీలర్లకు బుద్ధి పుట్టినప్పుడు, వాళ్ల అవకాశాన్ని బట్టి వెళ్లి థంబ్ వేస్తున్నట్లు సమాచారం. ఈ మూడు సరుకులు ఒకేసారి సరఫరా కావడం లేదు. ఒక్కొక్క సరుకు.. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు డీలర్లు ఎంఎల్‌ఎస్ పాయింట్లలో థంబ్ వేయాల్సి ఉంటుంది. దీంతో రేషన్ షాపులకు సరుకులు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. ఆ సరుకులు వచ్చినా.. తీసుకెళ్లడానికి అంగన్‌వాడీ కార్యకర్తలు పడే ఇబ్బందులే ఎక్కువ. సరుకులు వచ్చాయా లేదా అని తెలుసుకునేందుకు డీలర్లకు ఫోన్లు చేస్తే.. స్పందించి సమాచారం చెప్పడం లేదు. డీలర్ అందుబాటులో ఉంటే.. వీఆర్వో దొరకరు.. వీఆర్వో ఉంటే.. డీలర్ అందుబాటులో లేని పరిస్థితి. అందరూ అందుబాటులో ఉన్నా.. సాంకేతిక సమస్యలు, సిగ్నల్ సమస్యలతో మరోసారి వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా నెలలో మూడు రకాల సరుకులు తెచ్చుకోవడం అంగన్‌వాడీ కార్యకర్తలకు మానసిక ఒత్తిడి, ఆటోల ఖర్చుతో ఆర్థిక భారంగా తయారైంది.
Comments
Please login to add a commentAdd a comment