చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంరక్షణ, సమగ్ర వికాసానిక
అంగన్‌వాడీలకు
నెలనెలా అష్టకష్టాలు
● రేషన్ షాపుల ద్వారా
కేంద్రాలకు సరుకుల సరఫరా
● బియ్యం, కందిపప్పు, పామాయిల్ ఒకేసారి రావడం లేదు
● సరుకుల కోసం డీలర్ల చుట్టూ ప్రదక్షణలు
● కావలి డివిజన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నవంబర్‌లో 4,250 మంది గర్భిణులకు పరీక్షలు చేయగా, వారిలో 1,035 మందికి రక్తహీనత ఉన్నట్లుగా గుర్తించారు. బోగోలు మండలం కోవూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 454 మంది గర్భిణులకు పరీక్షలు చేయగా, 308 మందికి రక్తహీనతతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. దీన్ని బట్టి చూస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత, అవగాహన లోపం, పేదరికం, పోషకాహారాల విలువ తెలియకపోవడం తదితర కారణాలతో బాలలతోపాటు గర్భిణులు, బాలింతలు రక్తహీనతకు గురవుతున్నారని అర్థమవుతోంది.
కావలి సీడీపీఓ కార్యాలయం
కావలి: అంగన్‌వాడీ వర్కర్ల విధులు కత్తిమీద సాములా మారాయి. వీరికి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడంలో క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న పరిస్థితులను సంబంధితశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంపూర్ణ పోషకాహార లోపం.. పేదరికానికి శాపం కాకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి గర్భస్త శిశువులు, బాలింతలు, పుట్టిన పిల్లల నుంచి ఆరేళ్ల వయస్సు వచ్చే వరకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నాయి. అందులో భాగంగా ఎప్పటికప్పుడు పరిస్థితులను మెరుగు పరిచేందుకు అవసరమైన పర్యవేక్షణకు ‘పోషణ్ ట్రాకర్’ యాప్‌ను ప్రభుత్వం అమలు పరుస్తోంది. ఈ రికార్డులు ఎప్పటికప్పుడు అమలు చేయాలంటే.. సరుకుల పంపిణీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సమస్యలే.. అంగన్‌వాడీ కార్యకర్తలకు అష్టకష్టాలు తెచ్చి పెడుతోంది.
అంగన్‌వాడీల ద్వారా పోషకాహార కిట్లు
అంగన్‌వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రభుత్వం పోషకాహారాన్ని సరఫరా చేస్తోంది. 0–6 ఏళ్ల పిల్లలకు బాలామృతం, పిల్లలు, గర్భిణులు, బాలింతలకు గుడ్లు, పాలు, బాలసంజీవని కిట్లు అందజేస్తోంది. ఈ కిట్‌లో 2 కేజీల రాగిపిండి, కేజీ అటుకులు, బెల్లం, కర్జూరం, చిక్కీలు పావుకేజీ వంతున ఉంటాయి. ఇవన్నీ నేరుగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతుండగా, బియ్యం, ఆయిల్, కందిపప్పు మాత్రం రేషన్ షాపుల ద్వారా సరఫరా అవుతున్నాయి.
నెలకు రూ.వెయ్యి వరకు ఖర్చులు
గతంలో అంగన్‌వాడీ కేంద్రాలకు నేరుగా ప్రాజెక్ట్ సెంటర్ నుంచే సరుకులు వచ్చేవి. వీటిని రిసీవ్ చేసుకున్నట్లు సచివాలయాలకు వెళ్లి థంబ్ వేయాల్సి ఉండేది. ప్రస్తుతం ఆ విధానాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం పాల సరఫరాకు మాత్రమే సచివాలయాల్లో ఉండే మహిళా పోలీస్‌కు ఓటీపీ చెబితే సరిపోతోంది. బియ్యం, నూనె, కందిపప్పు తెచ్చుకోవడానికి మాత్రం అంగన్‌వాడీలకు కష్టాలు తప్పడంలేదు. ఒక గ్రామ పంచాయతీలో కొన్ని చోట్ల మూడు గ్రామాలు ఉన్నాయి. ఈ మూడు గ్రామాలకు ఒకడే రేషన్ డీలర్ ఉంటాడు. మూడు గ్రామాల్లో మూడు అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. దూరాభారంగా ఉన్న రేషన్ షాపుల నుంచి సరుకులు తెచ్చుకునేందుకు పలుమార్లు తిరగడానికి, ఆటోల చార్జీలకే నెలకు రూ.వెయ్యి వరకు ఖర్చు అవుతుంటే.. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదని అంగన్‌వాడీలు వాపోతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా, పట్టణాల్లో సరుకులు తెచ్చుకోవడానికి ప్రత్యేకంగా ఆటోను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
తప్పని మెమోలు..
అంగన్‌వాడీ కార్యకర్తలు రేషన్ సరుకుల కోసం పని వేళ్లల్లోనే డీలర్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. వీరు రేషన్‌షాపులకు వెళ్లిన సమయంలోనే సీడీపీఓలు, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్లు తనిఖీకి వస్తుంటారు. సెంటర్‌లో అంగన్‌వాడీ కార్యకర్త అందుబాటు లేకపోవడంతో విజిటింగ్ బుక్‌లో రాయడమే కాకుండా.. అందుబాటులో లేరని మెమోలు జారీ చేస్తున్న పరిస్థితి తప్పడం లేదని అంగన్‌వాడీలు వాపోతున్నారు.
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు
డీలర్ల ద్వారా ఎదురవుతున్న సమస్యలు పరిష్కరిస్తా
అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం, కందిపప్పు, నూనె రేషన్ షాపుల ద్వారా సరఫరా అవుతున్నాయి. వీటిని తెచ్చుకోవడంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి. ఒకేసారి అన్ని సరుకులు వచ్చేలా.. చూస్తాను. ఈ సమస్య పరిష్కారానికి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాను.
– సీహెచ్ సుశీలాదేవి, పీడీ, సీ్త్ర,
శిశు సంక్షేమ శాఖ, నెల్లూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment