ఆ విషాదం.. మానని గాయం | - | Sakshi
Sakshi News home page

ఆ విషాదం.. మానని గాయం

Published Sun, Dec 29 2024 12:37 AM | Last Updated on Sun, Dec 29 2024 12:37 AM

ఆ విష

ఆ విషాదం.. మానని గాయం

చంద్రబాబు ప్రచార యావకు జరిగిన తొక్కిసలాట ఘటనలో 8 మంది అమాయకులు బలైన విషాదానికి సరిగ్గా రెండేళ్లు అయింది. సంచలనం రేకెత్తించిన పెనువిషాద ఘట్టానికి కందుకూరు పట్టణంలో జరిగిన చంద్రబాబు బహిరంగ సభ వేదికై ంది. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి తోడు స్థానిక నాయకుల ఆధిపత్య పోరుతోనే ఈ దుర్ఘటన జరిగిందని నాడు విమర్శలు వినిపించాయి. ఆ విషాద ఘటనకు పూర్తిగా టీడీపీదే బాధ్యత అయినప్పటికీ.. ఆ నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉదారంగా ఆయా కుటుంబాలను ఆదుకుని బాసటగా నిలిచింది.

కందుకూరు: చంద్రబాబు.. నాడు ప్రతిపక్ష నేతగా ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం పేరుతో కందుకూరు పర్యటనకు వచ్చారు. అందులో భాగంగా రోడ్‌షోతోపాటు, ఎన్‌టీఆర్‌ సర్కిల్‌లో 2022 డిసెంబర్‌ 28వ తేదీ సాయంత్రం బహిరంగ నిర్వహించేందుకు ప్లాన్‌ చేశారు. అయితే ఈ కార్యక్రమం నిర్వహణలో పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించడంతో తొక్కిసలాట జరిగింది. చంద్రబాబు మధ్యాహ్నం సింగరాయకొండ జాతీయ రహదారి నుంచి ర్యాలీగా వచ్చి సాయంత్రం 4 గంటలకు ఎన్‌టీఆర్‌ సర్కిల్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమం బాగా ఆలస్యమై కందుకూరు చేరుకునే సరికి రాత్రి 7.30 గంటలైంది. దీనికి తోడు ఎన్‌టీఆర్‌ సర్కిల్‌ ఇరుకుగా ఉంటుంది. కేవలం 30 అడుగుల విస్తీర్ణం ఉండే రోడ్లకు పక్కనే పెద్ద సైడ్‌ కాలువలు ఉన్నాయి. ఇటువంటి ఈ ప్రాంతంలో స్థానిక నేతలు ఇంటూరి నాగేశ్వరరావు (ప్రస్తుతం ఎమ్మెల్యే), ఇంటూరి రాజేష్‌ పోటాపోటీగా రోడ్లకు ఇరువైపులా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అసలే ఇరుకై న రోడ్డు మరింత ఇరుగ్గా మారింది. ఇరుకైన రోడ్డులో సభను నిర్వహిస్తే.. జనం బాగా వచ్చినట్లు కనిపిస్తారని, డ్రోన్‌ వీడియోలకు బాగా వస్తాయని ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరించారు. చంద్రబాబు బహిరంగ ప్రదేశంలో కనీసం జనం నిలబడడానికి కూడా కాస్తంత ఖాళీ దొరకని పరిస్థితిని తీసుకొచ్చారు.

ఒక్కసారిగా తొక్కిసలాట

రాత్రి 7.30 గంటల సమయంలో చంద్రబాబు కాన్వాయ్‌ రాలీగా వచ్చింది. ఎన్‌టీఆర్‌ సర్కిల్‌లో చంద్రబాబు తన ప్రసంగ వాహనాన్ని నిలపాల్సి ఉండగా, కాస్త ముందుకు వచ్చి బాగా ఇరుగ్గా ఉండే ప్రదేశంలో ఆపారు. ఈ పరిణామంతో అప్పటికే కిక్కిరిసి ఉన్న ఈ నాలుగు రోడ్ల కూడలి మరింత ఇరుకుగా మారిపోయింది. చంద్రబాబు మాట్లాడే ముందు కొందరు గుండంకట్ట రోడ్డులో ఉన్న లైవ్‌ వెహికల్‌ ఎక్కడంతో లైవ్‌ రాదు.. మీరంతా దిగాలి అంటూ చంద్రబాబు కేకలు వేశారు. ఏయ్‌.. తమ్ముళ్లూ అందరూ దిగండి అంటూ పదే పదే అరిచారు. దీంతో ఆ ప్రాంతంలో అలజడి రేగింది. చంద్రబాబు ప్రసంగ వాహనానికి వెనుక వైపు ఉన్న వారంతా ఒక్కసారిగా ముందు వైపు చొచ్చుకురావడంతో మరింత గందరగోళ వాతావరణం నెలకొని తోపులాటకు దారి తీసింది. గుండంకట్ట రోడ్డులో జరిగిన ఈ తోపులాటకు పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాలు కింద పడిపోయాయి. ఈ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న జనా లు ఒక్కసారిగా పరుగు తీయడం మొదలు పెట్టారు. ఈ హడావుడిలో కొందరు జనాలు కింద పడిపోయారు. తొక్కిసలాట జరిగి అక్కడికక్కడే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే ప్రమాదం

చంద్రబాబు కందుకూరు పర్యటన అప్పటికి వారం రోజుల ముందే ఖారారైంది. దీంతో అప్పటి నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్‌ ఇరువురు కందుకూరు వేదికగా బల ప్రదర్శనకు దిగారు. పోటా పోటీగా ఫ్లెక్సీలు కట్టడడం మొదలు పెట్టారు. నిబంధనలు అతిక్రమించి కందుకూరు పట్టణం మొత్తం ఫ్లెక్సీలతో నింపారు. చంద్రబాబు బహిరంగ సభ ప్రదేశమైన ఎన్‌టీఆర్‌ సర్కిల్‌లో ఇష్టారీతిన ఫ్లెక్సీలు, భారీ హోరింగ్‌లు పెట్టారు. సర్కిల్‌ నుంచి పామూరు వైపు వెళ్లే రోడ్డు 100 అడుగుల పైనే విస్తీర్ణం ఉంటుంది. ఈ రోడ్డు వైపు నిలబడే చంద్రబాబు ప్రసంగించాలి. ఆయనకు కనిపించే విధంగా రోడ్డుకు ఇరువైపులా రోడ్డు మొత్తం ఆక్రమించి ఇరువైపులా భారీ ఫ్లెక్సీలు కట్టారు. 40 అడుగులకు కుచించుకుపోయింది. కొద్ది మంది జనం వచ్చినా కూడా భారీగా కనిపించాలనే ఆలోచనలతో ఈ పని చేశారు. దీంతో రోడ్డు మొత్తం ఇరుకుగా మారిపోయింది. కిక్కిరిసి ఉన్న జనాన్ని డ్రోన్‌ షాట్‌లు తీసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకోవాలనే ప్రణాళిక వల్లే ఎనిమిది చనిపోయారని నాడు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.

మృతుల కుటుంబాలను ఆదుకున్న నాటి జగన్‌ ప్రభుత్వం

చంద్రబాబు బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణ సాయం ప్రకటించారు. వాస్తవానికి ఇది పూర్తిగా టీడీపీ నిర్లక్ష్యం వల్లే జరిగినప్పటికీ బాధ్యతగా ప్రభుత్వం నుంచి సాయం అందించి ఆ కుటుంబాలకు బాసటగా నిలిచారు. 8 మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ఆ నాటి వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు చర్యలు తీసుకున్నారు.

కందుకూరు దుర్ఘటనకు రెండేళ్లు

ఇరుకురోడ్ల కూడలిలో చంద్రబాబు బహిరంగ సభ

తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన

8 మంది అమాయకులు

బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల సాయంతో బాసటగా నిలిచిన

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

No comments yet. Be the first to comment!
Add a comment
ఆ విషాదం.. మానని గాయం 1
1/1

ఆ విషాదం.. మానని గాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement