ఉద్యోగులకు 5 రోజుల సెలవులు | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు 5 రోజుల సెలవులు

Published Tue, Jan 7 2025 12:23 AM | Last Updated on Tue, Jan 7 2025 12:24 AM

ఉద్యో

ఉద్యోగులకు 5 రోజుల సెలవులు

● సంక్రాంతికి వరుసగా

అధిక చార్జీలు

వసూలు చేస్తే కఠిన చర్యలు

సంక్రాంతి పేరు చెప్పి ప్రైవేట్‌ యాజమాన్యాలు అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా రవాణా అధికారులతో మూడు బృందాలను ఏర్పాటు చేస్తాం. జాతీయ రహదారిపై ప్రతి రోజూ తనిఖీలు చేపడతాం. అధిక చార్జీలు వసూలు చేశారని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తే ఆ బస్సు యాజమాన్యంపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి సీజ్‌ చేస్తాం. సాధారణ చార్జీల కంటే అదనంగా వసూలు చేయరాదు.

– బి.చందర్‌, డీటీసీ, రవాణా శాఖ

9 నుంచి 19 వరకు పాఠశాలలు, కళాశాలలకు హాలిడేస్‌

హైదరాబాద్‌, బెంగళూరు నుంచి సొంతూళ్లకు క్యూ

పండగ పేరుతో మూడు రెట్లు చార్జీల పెంచేసిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌

చోద్యం చూస్తున్న రవాణా శాఖ

అధికారులు

సంకాంత్రి పండుగకు ‘ప్రత్యేక’ సర్వీసుల పేరుతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అధికారికంగానే దోపిడీకి పాల్పడుతున్నాయి. పండగలు, సెలవు రోజుల్లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనైనా ఫిక్స్‌డ్‌ చార్జీలే ఉండాలనే రవాణా శాఖ నిబంధనను ట్రావెల్స్‌ యాజమాన్యం డోంట్‌ కేర్‌ అంటోంది. బహిరంగంగా వెబ్‌సైట్‌లో టికెట్‌ ధరలు నిర్ణయించినా.. దానిపై కూడా అధికంగా వసూలు చేస్తున్నా.. రవాణా శాఖాధికారులకు తెలిసినా.. మిన్నకుండిపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నెల్లూరు (టౌన్‌): సంక్రాంతి పండగకు సొంతూర్లకు రావడానికి జిల్లా ప్రజలకు ట్రావెల్స్‌ యాజమానులు చుక్కలు చూపిస్తున్నారు. పండగ పేరుతో దర్జాగా వెబ్‌సైట్‌లోనే ధరలు పెట్టి దోపిడీ చేస్తున్నారు. సాధారణ చార్జీల కంటే రెండు నుంచి మూడు రెట్లు చార్జీలు ఆయా వెబ్‌సైట్‌ల్లో పొందుపరిచారు. హైదరాబాద్‌, బెంగళూరు తదితర నగరాల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన స్థానికులు నెల ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకుందామనుకుంటే భారీగా పెంచిన చార్జీలే ఉన్నాయి. వెబ్‌సైట్‌ల్లో అధిక చార్జీలు కనిపిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపక పోవడంపై ప్రయాణికులు మండి పడుతున్నారు. తిరుగు ప్రయాణంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక కుటుంబం సొంతూరికి వచ్చిపోవాలంటే.. రూ.20 వేల వరకు చార్జీలకే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోనీ చార్జీలు పెంచలేదని ఆర్టీసీ బస్సుల్లో వెళదామనుకున్నా సరిపడా బస్సులను రాష్ట్ర ప్రభుత్వం తిప్పడం లేదు.

పండగలకు వరుస సెలవులు

జిల్లా నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ప్రతి రోజూ సుమారు 150కు పైగా ట్రావెల్స్‌ బస్సులు తిరుగుతున్నాయి. 13న సోమవారం భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ పండగ వచ్చింది. 11వ తేదీ రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో ఉద్యోగులకు వరుసగా ఐదు రోజులు సెలవులొచ్చాయి. ఈ నెల 9 నుంచి 19వ తేదీ వరకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులిచ్చారు. అదే సాఫ్ట్‌వేర్‌ రంగంలో గురు, శుక్రవారాల్లో సెలవు పెట్టుకుంటే వరుసగా 9 రోజులు కలిసొస్తాయి. ఈ రీతిలో ఉద్యోగులు, విద్యార్థులకు వరుస సెలవులు రావడంతో సంక్రాంతి పండగకు తమ సొంతూళ్లకు వచ్చేందుకు హైదరాబాద్‌, బెంగళూరు. చైన్నె, వైజాగ్‌ తదితర ప్రాంతాల్లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.

రెండు నుంచి మూడు రెట్ల పెంపు

సంక్రాంతి పండగ పేరుతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు సాధారణ చార్జీల కంటే అదనంగా రెండు నుంచి మూడు రెట్లు పెంచాయి. జిల్లా నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చైన్నె, వైజాగ్‌ నుంచి నెల్లూరు జిల్లాకు ప్రతి రోజు 150కుపైగా బస్సులు తిరుగుతుంటాయి. పండుగ పేరుతో ఈ నెల 10, 11 తేదీల్లో అమాంతం చార్జీల పెంచారు. పండగ తరువాత తిరిగి వెళ్లాలంటే 15 నుంచి 19వ తేదీ ఆదివారం వరకు అదే ధరలు ఉన్నాయి. టికెట్‌ కోసం వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే ఒక చార్జీ ఉంటుందని, తీరా బుకింగ్‌ చేసుకుందామని క్లిక్‌ చేస్తే మరో చార్జీ కనబడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు.

మొక్కుబడిగా తనిఖీలు

ట్రావెల్స్‌ బస్సులపై జిల్లా రవాణా శాఖ అధికారులు మొక్కుబడి తనిఖీలు నిర్వహిస్తున్నారన్న విమర్శలన్నాయి. బస్సు చార్జీలను అమాంతంగా పెంచి నేరుగా వెబ్‌సైట్‌ల్లో పెట్టినా వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేక పోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు చేస్తున్న చార్జీల దోపిడీపై కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మిన్నకుండడంపై పలువురు మండి పడుతున్నారు.

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు

ప్రాంతం ఏసీ స్లీపర్‌ నాన్‌ ఏసీ స్లీపర్‌ నాన్‌ ఏసీ

సాధారణ – పెరిగిన ధర సాధారణ – పెరిగిన ధర సాధారణ – పెరిగిన ధర

హైదరాబాద్‌ రూ.1,600 – రూ.4,934 రూ.1,000 – రూ.2,800 రూ. 850 – రూ.2,100

బెంగళూరు రూ. 1,000 – రూ.2,600 రూ. 900 – రూ.2,200 రూ. 800 – రూ.1,900

వైజాగ్‌ రూ. 1,700 – రూ. 3,100 రూ. 1,100 – రూ.2,350 –––––––––––––

పెంచిన చార్జీలను ఒకసారి పరిశీలిస్తే..

No comments yet. Be the first to comment!
Add a comment
ఉద్యోగులకు 5 రోజుల సెలవులు 1
1/1

ఉద్యోగులకు 5 రోజుల సెలవులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement