తల్లికి వందనం పేరుతో మోసం
నష్టపరిహారం కోసం..
నెల్లూరు(అర్బన్): ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది’ అని పీడీఎస్‌యూ నేతలు మండిపడ్డారు. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సునీల్, నాయకులు కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం ఇచ్చారు. సునీల్ మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పేరుతో క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నగదు అందించారన్నారు. అంతకన్నా ఎక్కువ ఇస్తానని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వర్తింపజేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడునెలలైనా పట్టించుకోలేదన్నారు. ఇందువల్ల విద్యార్థులు పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రి కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే విద్యార్థి సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామన్నారు.
ఆలకించండి
అయ్యా మా సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రాల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓల చుట్టూ కాళ్లరిగేలా పలుమార్లు తిరిగాం. అయినా ఉపయోగం లేదు. తప్పని పరిస్థితుల్లో వ్యయ, ప్రయాసలకోర్చి దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్ వచ్చాం. మీరైనా మా మొర ఆలకించి సమస్యలు పరిష్కరించాలని పలువురు ప్రజలు అధికారులకు మొర పెట్టుకున్నారు. ప్రజల నుంచి కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, డీపీఓ శ్రీధర్‌రెడ్డి తదితరులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
రామాయపట్నం పోర్టు కోసం కర్లపాళెంలోని ఇళ్లు, భూములిచ్చాం. పోర్టు మొదటి దశ పనులు పూర్తి కావొస్తున్నా మాకు ఇంకా నష్టపరిహారం ఇవ్వలేదు. బతుకుదెరువు లేక ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే నష్టపరిహారం చెల్లించడంతోపాటు కరువు భత్యం, ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం కల్పించాలి. చేపల వేటకు అనుకూలంగా బోట్లు నిలిపేందుకు జెట్టీని ఏర్పాటు చేయాలి.
– బాలాజీ, సుబ్బులు, రఘుబాబు,
కర్లపాళెం గ్రామ నిర్వాసితులు
కూటమి ప్రభుత్వంపై
పీడీఎస్‌యూ మండిపాటు
కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యలపరిష్కార వేదిక’
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అర్జీదారులు
Comments
Please login to add a commentAdd a comment