రాపూరు: మండలంలోని పోకూరుపల్లిలో ఉన్న సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని బుధవారం జెడ్పీ సీఈఓ విద్యారమ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో మంచినీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. పోకూరుపల్లి ఎస్టీకాలనీకి పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ఇందుకోసం రూ.4 ల క్షలు మండల పరిషత్ నిధులను వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ ప్రసన్న, ఎంపీడీఓ భవానీ, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మోహన్‌రావు, ఏఈ ఆంజనేయులు, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment