14న బ్రాహ్మణక్రాకలో ఎడ్ల బండలాగుడు పోటీలు
జలదంకి: మండలంలోని బ్రాహ్మణక్రాక గ్రామంలో ఈ నెల 14న రాష్ట్రస్ధాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏడాది సంక్రాంతి సంబరాల్లో భాగంగా బ్రాహ్మణక్రాక శివాలయం వద్ద ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీలలో విజేతలైన ఎడ్ల యజమానులకు ప్రథమ బహుమతి రూ.50 వేలు, ద్వితీయ బహుమతి రూ.40 వేలు, తృతీయ బహుమతి రూ.30 వేలు, నాల్గో బహుమతి రూ.20 వేలు, ఐదవ బహుమతి రూ.15 వేలు అందిస్తామన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతి రూ.5 వేలు ఉంటుందన్నారు. ఆసక్తి గల ఎడ్ల యజమానులు 90103 24652, 91820 43989 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.
ఆత్మీయ సమావేశంలో కూటమి నేతల అలకలు
వింజమూరు (ఉదయగిరి): వింజమూరులో బుధవారం జరిగిన ఉదయగిరి నియోజకవర్గ స్ధాయి కూటమి పార్టీల (టీడీపీ, జనసేన, బీజేపీ) నేతల ఆత్మీయ సమావేశం అలకలకు వేదికై ంది. పార్టీ శ్రేణులను ఆప్యాయంగా పలకరించే నిమిత్తం ఎంపీ వేమిరెడ్డి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశ సమన్వయ బాధ్యత ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు అప్పగించారు. అయితే సమావేశంలో కొంతమంది సీనియర్ టీడీపీ నేతలను స్టేజీ మీదకు ఆహ్వా నం లేకపోవడంతో అలకబూనారు. పార్టీకి ఎంతో సేవ చేసినా తమకు ప్రాధాన్యత ఇవ్వకపోడంపై అసంతృప్తితో మౌనంగా ఉండిపోయారు. సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సమావేశం మధ్యలోనే మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి వెళ్లిపోయారు.
పంచాయతీల్లో పన్నులు
వందశాతం వసూలు చేయాలి
నెల్లూరు (పొగతోట): పంచాయతీల్లో వాటర్, హౌస్ ట్యాక్స్‌లను వందశాతం వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని డీపీఓ శ్రీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో డీఎల్‌పీఓలు, ఈఓపీఆర్‌డీలు, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో డీపీఓ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పరిచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. స్వామిత్ర కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. వీధిలైట్లు పూర్తి స్థాయిలో వెలిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కుష్టు రహితంగా
జిల్లాను మారుద్దాం
● 14 రోజుల పాటు ఇంటింటి సర్వే
నెల్లూరు రూరల్: జిల్లాను కుష్టురహితంగా చేయడానికి సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని శంకరన్‌హాల్‌లో కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అధ్యక్షతన కరపత్రాలు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 14 రోజుల పాటు ఇంటింటా సర్వే చేయాలని, ప్రజల్లో శాసీ్త్రయమైన అవగాహన కల్పించాలని సూచించారు. సర్వే చేపట్టే ముందే టీంలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని, వ్యాధిగ్రస్తులతో పనిచేసే స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకుని వారిని భాగస్వాములను చేయాలని సూచించారు. సర్వేలో గ్రామ పంచాయతీ సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వి సుజాత, అడిషనల్ డీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ, జెడ్పీ సీఈఓ విద్యారమ, మెప్మా పీడీ రాధమ్మ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుశీల, ఆశా కోఆర్డినేటర్ మంజులమ్మ, డిప్యూటీ డీఈఓ లక్ష్మీప్రసన్న, డెమో అధికారి కనకరత్నం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment