కష్టం ఫలించింది
చిన్నప్పటి నుంచి క్యారమ్స్ అంటే ఎంతో ఇష్టం. నాన్న చనిపోయిన తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాం. జెరాక్స్ మెషీన్‌ను రిపేర్ చేస్తూ జీవితాన్ని సాగిస్తున్నాను. ఇప్పటికి వివిధ స్థాయిల్లో 17 రాష్ట్ర పతకాలను సాధించాను. 29వ ఆలిండియా ఫెడరేషన్ టోర్నమెంట్ విజేతగా నిలవడం ఆనందంగా ఉంది. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నీరజ్ కుమార్ సపంతి ప్రోత్సాహం మరువలేనిది. చాలా సంవత్సరాల తర్వాత జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌ను సాధించిన తెలుగువాడిగా గర్వపడుతున్నాను. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో తెలుగుజాతి గౌరవాన్ని నిలబెడతా.
– సీహెచ్ జనార్దనరెడ్డి,
నేషనల్ క్యారమ్ చాంపియన్
Comments
Please login to add a commentAdd a comment