నారాయణ ఆస్పత్రి కోసం రెడ్‌క్రాస్ నిర్వీర్యానికి కుట్ర
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో రెడ్‌క్రాస్ ద్వారా కేన్సర్ ఇన్‌స్టిట్యూట్, బ్లడ్‌బ్యాంకు, మానసిక దివ్యాంగుల కేంద్రం, ఏఆర్‌వీ సెంటర్, ప్రకృతి వైపరీత్యాల సంస్థ, జెనరిక్ మందులషాపు, పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం, హెచ్‌ఐవీ క్లినిక్, మృతుల భౌతిక కాయాలకు ఉచిత ప్రీజర్ బాక్సులు, తలసేమియా రోగుల కేంద్రం, జూనియర్ రెడ్‌క్రాస్ ఇలా 13 ప్రాజెక్టులను మరింత దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీలకు చెందిన వారు రెడ్‌క్రాస్‌లో సభ్యులుగా ఉన్నారు. కమిటీ మెంబర్లుగా ఉన్నారు.
చంద్రశేఖర్‌రెడ్డి కాలంలో మరింత గుర్తింపు
పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి రెడ్‌క్రాస్ చైర్మన్‌గా ఎన్నికై న తర్వాత అందరినీ కలుపుకొంటూ సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. కోవిడ్ సమయంలో బంధుమిత్రులు దగ్గరకు రాని సమయంలో కూడా కమిటీ సభ్యులే మృతదేహాలకు దహన సంస్కారాలు జరిపించారు. లాక్‌డౌన్ సమయంలో పెద్దాస్పత్రిలో రెడ్‌క్రాస్ వలంటీర్లు పనిచేశారు. ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేట్‌లను ఇళ్లవద్దకు చేర్చారు. వేలాది మంది ప్రయాణికులకు నెలరోజులకు పైగా ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు. నడిచిపోతున్న సుదూర ప్రాంతాల వారికి ప్రత్యేకంగా 13 బస్సులను ఏర్పాటు చేసి ఉచితంగా వారి స్వస్థలాలకు చేర్చారు. పెన్నానదికి వరదలు వచ్చినప్పుడు, జోరు వానలు కురిసి పేదలకు పనులు లేనప్పుడు పెద్ద ఎత్తున శిబిరాలు ఏర్పాటు చేసి ఆహార పదార్ధాలు, వంట సామగ్రి అందేలా చేశారు. దీంతో నెల్లూరు రెడ్‌క్రాస్ సేవలకు దేశస్థాయిలో మొదటి స్థానంలో గుర్తింపు లభించింది.
గతంలో పెద్దాస్పత్రిని నిర్వీర్యం చేసిన మంత్రి
2014 నుంచి 2019 వరకు నారాయణ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో పెద్దాస్పత్రికి అన్ని హంగులు కల్పిస్తానని, రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందేలా చేస్తానని చెప్పి అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. జిల్లా మంత్రి అయి ఉండి కూడా తన సొంత ఆస్పత్రిని అభివృద్ధి చేసుకున్నారు. పెద్దాస్పత్రిలో డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ ఇలా అన్ని పోస్టులు ఖాళీగా పెట్టాడు. చివరికి నారాయణ ఆస్పత్రిలోని వారే పెద్దాస్పత్రి డాక్టర్లపై పెత్తనం చేశారు. రోగులకు కనీస వైద్యసేవలందక విలవిలలాడారు. అలాంటి మంత్రి ఇప్పుడు తన సొంత ఆస్పత్రి అభివృద్ధికి మరోదఫా ఆరాట పడుతున్నారు. ఇప్పుడు రెడ్‌క్రాస్‌ను చేజిక్కించుకోవాలని, రెడ్‌క్రాస్ కేన్సర్ ఆస్పత్రిని నిర్వీర్యం చేయాలని ఎంఓయూ రూపంలో ముందుకు వచ్చాడు. టీడీపీకి చెందిన వ్యక్తిని రెడ్‌క్రాస్ చైర్మన్ చేసేందుకు మంత్రి నారాయణ పావులు కదిపారు. తద్వారా తన పని సులభతరం చేసుకోనున్నారు. రెడ్‌క్రాస్ వంటి సేవా సంస్థల్లోకి నారాయణ లాంటి వ్యక్తులు ప్రవేశించడం ఎంత మాత్రం మంచిది కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
కలెక్టర్‌తో కమిటీ సభ్యుల సమావేశం
బుధవారం సాయంకాలం కలెక్టర్ ఆనంద్ రెడ్‌క్రాస్ కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. పొలిటికల్ నేపథ్యం ఉన్న వారు పదవుల నుంచి నిబంధనల ప్రకారం తప్పుకోవాలని కోరారు. అయితే చంద్రశేఖర్‌రెడ్డి రాజీనామా చేశాక ఎవరిని రెడ్‌క్రాస్ చైర్మన్‌గా ఎన్నుకుంటారనే చర్చ జరగలేదు.
రెడ్‌క్రాస్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వీర్యానికి కుట్ర
రెడ్‌క్రాస్ అంటేనే సేవకు ప్రతిరూపం. ఇందులోని సభ్యులు జాతి, మత, కుల, వర్గ, వర్ణ వయో భేదాలు లేకుండా ప్రజలకు సేవ చేస్తుంటారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కుటుంబ సభ్యులు లాగా ఆదుకుంటారు. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందాలని, మంచి ఆరోగ్యం ఉండాలని, నర్సులకు శిక్షణ ఇవ్వడం, రోగులకు రక్తం అందించేందుకు బ్లడ్‌బ్యాంకులు స్థాపించడం లాంటి కార్యక్రమాలతో ప్రజలకు, రోగులకు అండగా నిలుస్తారు. అలాంటి రెడ్‌క్రాస్‌కు మంత్రి నారాయణ వల్ల చెదలు పడుతోంది.
నారాయణ ఆస్పత్రిలో రోగులను
పెంచుకునేందుకు పావులు
అందులో భాగంగా రెడ్‌క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డికి బెదిరింపులు
విమర్శలకు తావివ్వకూడదని
హుందాగా తప్పుకున్న చైర్మన్
మంత్రి నారాయణ నిర్వహిస్తున్నది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి. అయినా అక్కడ కేన్సర్ విభాగం లేదు. దీంతో మంత్రి కేన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు. మెడికల్ అంకాలజీ, సర్జికల్ అంకాలజీ, రేడియేషన్ అంకాలజీకి చెందిన మూడు రకాల సేవలందిస్తేనే ఆరోగ్యశ్రీలో చేర్చుకుంటారు. నారాయణ ఆస్పత్రిలో ఇప్పట్లో రేడియేషన్ అంకాలజీ ప్రారంభించే పరిస్థితులు లేవు. రేడియేషన్ అంకాలజి కోసం ప్రత్యేక బంకర్ ఏర్పాటు చేయాలి. నిర్మాణాలు జరగాలి. అందువల్ల రెడ్‌క్రాస్ కేన్సర్ ఆస్పత్రిని ఎంఓయూ పేరుతో చేజిక్కించుకోవాలని కుట్ర పన్నారు. ఎంఓయూకి రెడ్‌క్రాస్ కమిటీ సభ్యులు ఒప్పుకోలేదు. నారాయణ చేతిలో పడితే గతంలో పెద్దాస్పత్రిని నిర్వీర్యం చేసినట్టు చేస్తారని సభ్యులు పేర్కొన్నారు. దీంతో మంత్రి ఎలాగైనా చంద్రశేఖర్‌రెడ్డిని పదవి నుంచి తప్పిస్తే రెడ్‌క్రాస్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను హస్తగతం చేసుకోవచ్చని భావించారు. అందుకు తన అనుచరులతో బెదిరింపులు చేయించారు ఫోన్‌లు చేయించి భయపెట్టారు. చట్టబద్ధంగా ఎన్నికై నప్పటికీ రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తి పదవిలో ఉండటానికి వీలు లేదంటూ సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేయించసాగారు. ఈ నేపథ్యంలోనే అధికార అహంకారంతో ఒత్తిడి తెచ్చి నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర రెడ్‌క్రాస్ కమిటీ ద్వారా పదవి నుంచి వైదొలగాలంటూ చంద్రశేఖర్‌రెడ్డికి లెటర్ పంపారు. రెడ్‌క్రాస్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి 20 రోజుల్లో పూర్తి చేసి రాజీనామా చేస్తామని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పినా మంత్రి నారాయణ ఆగలేదు. నిత్యం దుష్ప్రచారానికి తన అనుచరుల ద్వారా పూనుకున్నాడు. దీంతో విమర్శలకు తావివ్వకూడదని చంద్రశేఖర్‌రెడ్డి రాజీనామా చేశారు.
విమర్శలకు తావివ్వకూడదనే రాజీనామా
చట్టబద్ధంగా ఎన్నికైన కమిటీ నుంచి రెడ్‌క్రాస్ చైర్మన్‌గా తనను తొలగించే అధికారం ఎవరికీ లేదు. మంత్రి నారాయణ బెదిరింపులకు కూడా భయపడేది లేదు. అయితే అనవసరంగా విమర్శలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే తాను చైర్మన్ పదవికి రాజీనామా చేశా. అయితే ఒక మేనేజింగ్ కమిటీ సభ్యునిగా రెడ్‌క్రాస్ సేవలను కొనసాగిస్తాను. రెడ్‌క్రాస్‌ను నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకుంటాను.
– పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ
Comments
Please login to add a commentAdd a comment