తల్లిదండ్రులపై కన్న కొడుకు దాడి
బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని దామరమడుగు గ్రామంలో మానసిక స్థితి సరిగాలేని ఓ యువకుడు చేసిన దాడిలో అతని తండ్రి మృతిచెందగా తల్లి తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని మఠంకాలనీ (ఆర్‌ఆర్‌నగర్)కి చెందిన అంతటి శ్రీనివాసులు, సుబ్బమ్మ దంపతులు, వారి కుమారుడు ఏడుకొండలు నివాసం ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా ఏడుకొండలు మానసిక స్థితి సరిగాలేక తల్లిదండ్రులపై తరచూ దాడులు చేస్తుండేవాడు. నెల్లూరులోని ఓ మానసిక చికిత్సా కేంద్రంలో వైద్యం కూడా చేయించారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం కూలి పనికి వెళ్లి ఇంటికి వచ్చి పడుకున్న తల్లిదండ్రులపై ఏడుకొండలు పెద్ద కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో తండ్రి శ్రీనివాసులు (57) అక్కడికక్కడే మృతిచెందగా తల్లి సుబ్బమ్మ తీవ్రంగా గాయపడడంతో 108 వాహనంలో నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. దాడి అనంతరం నిందితుడు పరారయ్యాడు. విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ జి.శ్రీనివాసరావు, సీఐ, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.
తండ్రి మృత్యువాత, తల్లికి తీవ్రగాయాలు
దామరమడుగులో ఘటన
Comments
Please login to add a commentAdd a comment