నేటితో ముగియనున్న దేహదారుఢ్య పరీక్షలు
● గైర్హాజరైన వారు నేడూ
హాజరు కావొచ్చు
నెల్లూరు(క్రైమ్): కొలువే లక్ష్యంగా కానిస్టేబుల్ అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షల్లో పోటీపడుతున్నారు. నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో గతనెల 30వ తేదీ నుంచి జరుగుతున్న ఈ పరీక్షలు గురువారంతో ముగియనున్నాయి. ఇప్పటి వరకు పరీక్షలకు గైర్హాజరైన వారందరూ చివరిరోజు హాజరు కావొవ్చని పోలీసు అధికారులు తెలిపారు. బుధవారం జరిగిన పరీక్షలకు 554 మంది హాజరయ్యారు. వారిలో 482 మందికి పరీక్షలు నిర్వహించారు. ఎస్పీ జి.కృష్ణకాంత్, ఏఎస్పీ సీహెచ్ సౌజన్యలు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment