ఉదయగిరి: దాసరపల్లికి చెందిన గొల్లపల్లి అభిలాష్ సోమవారం మధ్యాహ్నం ఉదయగిరి పట్టణంలో పనులు ముగించుకుని తల్లి అరుణతో మోటార్‌బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. దాసరపల్లి సమీపంలో ఉన్న ఎగువ క్రాస్ వద్ద వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పింది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అప్పసముద్రం నుంచి ఉదయగిరి వస్తున్న 104 వాహనంలోని హెల్త్ అసిస్టెంట్ మన్సూర్‌అలీ క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి ఆటోలో ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు వారికి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు జిల్లా ఆస్పత్రికి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment