విధులకు హాజరు కారు.. సేవల్లో నిర్లక్ష్యం
నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయ అధికారుల నుంచి సిబ్బంది వరకు నిర్లక్ష్య ధోరణి కనిపించింది. సోమవారం కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక జరుగుతున్న తీరుపై ‘సాక్షి’ విజిట్ చేసింది. అధికారులు, సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కాలేదు. ప్రజలకు అందించే సేవల్లోనూ నిర్లక్ష్యం బయటపడింది. అధికారుల కంటే ముందే ముగ్గురు అర్జీదారులు వచ్చారు. 10.45 గంటల వరకు తహసీల్దార్ లాజరస్ హాజరు రాలేదు. కార్యాలయ సిబ్బంది సైతం తహసీల్దార్ వచ్చే సమయానికే విధులకు హాజరయ్యారు. అప్పటి వరకు అర్జీదారులు కార్యాలయం బయట పడిగాపులు పడాల్సి వచ్చింది. సమయ పాలనపై ‘సాక్షి’ తహసీల్దార్‌ను వివరణ కోరగా కోర్టు కేసు ఉన్న నేపథ్యంలో ఆలస్యమైందని బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment