ఆర్డీఓ కార్యాలయం.. అతీతం కాదు
కాళ్లరిగేలా తిరుగుతున్నా.. పరిష్కారం శూన్యం
రోడ్డు నిర్మాణం కోసం నాకు చెందిన 31 సెంట్ల భూమిని తీసుకున్నారు. రెండేళ్ల నుంచి నష్ట పరిహారం కోసం కలువాయి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. గత వారంలో ఆర్డీఓ ఆదేశించినా మండల అధికారులు ఖాతరు చేయలేదు. వీఆర్‌ఓ సర్టిఫికెట్ ఇస్తేనే అవార్డు చెక్కు ఇస్తామని చెబుతున్నారంటూ బాధితుడు ఆర్డీఓ పావని దృష్టికి తీసుకెళ్లారు.
– పలుకూరి బ్రహ్మయ్య, లలితానగర్
ఆత్మకూరు: విధి నిర్వహణలో సమయపాలన పాటించడంలో, సమస్యల పరిష్కారంలో అలవికాని జాప్యం చేయడంలో ఆర్డీఓ కార్యాలయ అధికారులు అతీతులు కారని సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక రుజువు చేసింది. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ‘సాక్షి’ విజిట్ చేసింది. ఆర్డీఓ 10.10 గంటలకే కార్యాలయానికి చేరుకోగా తహసీల్దార్ 11.10 గంటలకు వచ్చారు. అప్పటికే రెండు మార్లు తహసీల్దారు గురించి ఆర్డీఓ వాకబు చేయడం గమనార్హం. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరుకావాల్సి ఉండగా కేవలం ఐసీడీఎస్, బీసీ సంక్షేమ శాఖల సిబ్బంది హాజరు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment