ఆలస్యంగా అధికారుల హాజరు
కందుకూరు రూరల్: తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదు ల కార్యక్రమానికి అధికారులు ఆలస్యంగా హాజరయ్యారు. తహసీల్దార్ ఇక్బాల్, ఏఓ మినహా మిగిలిన అధికారులందరూ 10.30 గంటల తర్వాతే వచ్చారు. రెండు అర్జీలు మాత్రమే అందాయి. కందుకూరులోని ప్రకా శం కాలనీకి చెందిన పి.హెబ్సిబా అనే దివ్యాంగురాలికు సంబంధించిన ఇంటి స్థలాన్ని కె.ఆదాము అనే వ్యక్తి కొంత ఆక్రమించుకొని ప్రహరీ నిర్మించుకున్నాడు. ఆక్రమణను తొలగించి స్థలం హద్దు చూపించాలని తల్లి రత్తమ్మతో కలిసి తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
మూడు నెలలుగా తిరుగుతున్నా..
మాది మొగిలిచర్ల. మేము ఇద్దరం అన్నదమ్ములం. పొలాలు పంచుకుని రిజి స్ట్రేషన్ చేయించుకున్నాం. అయితే పొలమంతా మా అన్న మీద ఆన్‌లైన్ చేశారు. మా అన్నపై ఉన్న సగం పొలాన్ని ఆన్‌లైన్ నా పేరు మీదకు మార్చమని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాను. వీఆర్వో, ఆర్‌ఐ రేపు చేస్తాం.. ఎల్లుండి చేస్తామ ని తిప్పుకుంటున్నారు.
– పల్లపోతు గోవిందయ్య రైతు, మొగిలిచర్ల, లింగసముద్రం మండలం
ఉదయగిరి: ప్రతి సోమవారం జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి సంబంధిత అధికారులు విధులకు డుమ్మా కొడుతున్నారు. ఒక వేళ వచ్చినా సమయపాలన పాటించడం లేదు. ఈ కార్యక్రమానికి 17 శాఖల అధికారులు హాజరుకావాల్సి ఉన్నా.. అందరూ రావడం లేదు. కొంత మంది మండల స్థాయి అధికారులు తమకు బదులు కింది స్ధాయి సిబ్బందిని పంపుతున్నారు. ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఉదయం 10 గంటలకు తహసీల్దార్ సుభద్రతోపాటు నాలుగు శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత 12 గంటల వరకు పలు శాఖల అధికారులు, సిబ్బంది ఒక్కొక్కరు వస్తూనే ఉండడం గమనార్హం. మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తున్నారి స్పష్టమైంది. భూ సమస్య పరిష్కారం కోసం కేవలం ఒకే ఒక వ్యక్తి అర్జీ ఇచ్చారు.
అధికారులు డుమ్మా..
మొక్కుబడిగా విధులు
Comments
Please login to add a commentAdd a comment