సెస్ టార్గెట్ పూర్తి చేయండి
● సెక్రటరీలకు జేడీ ఆదేశం
నెల్లూరు(సెంట్రల్): జిల్లాలకు సెస్ వసూళ్ల విషయంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు ఇచ్చిన టార్గెట్‌ను ప్రతి ఒక్క సెక్రటరీ పూర్తి చేయాలని వ్యవసాయశాఖ మార్కెటింగ్ శాఖ జాయిట్ డైరెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. నెల్లూరులోని ఏఎంసీ హాలులో నెల్లూరు, ప్రకాశం జిల్లాల మార్కెటింగ్ శాఖ సెక్రటరీలతో సోమవారం సమావేశం న్విహించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ టార్గెట్ పూర్తి చేయడానికి కేవలం రెండున్నర నెలలు కూడా లేదన్నారు. ఈ ఏడాది పంట వేసేదాంట్లో కొంత తేడా వచ్చిందని, కానీ టార్గెట్ విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు సెక్రటరీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment